"ఓ క్రికెట్ వీరాభిమాని.. నీ ఐడియా అదుర్స్‌"

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2020 12:05 PM GMT
ఓ క్రికెట్ వీరాభిమాని.. నీ ఐడియా అదుర్స్‌

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి క‌ట్ట‌డికి చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించాయి. దీంతో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌మ అభిరుచుల‌ను మాత్రం మిస్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. క్రికెట్‌ను అమితంగా ప్రేమించే ఓ వ్య‌క్తి అత‌డు క్రికెట్‌ను ఎంత మిస్ అవుతున్నాడో అర్థ‌మ‌య్యేలా ఓ వీడియో చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి న‌వ్వులు పూయిస్తోంది. ఇంగ్లాండ్ మాజీ ఆట‌గాడు కెవిన్ పీట‌ర్స‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను పోస్తు చేశాడు.,

ఓ వ్య‌క్తి ఇంట్లోనే ప్రాక్టీస్ మొద‌లెట్టేశాడు. మైదానంలోకి ఆట‌గాళ్లు బ‌రిలోకి దిగిన‌ట్లుగానే క్రికెట్ కిట్‌తో దిగాడు. అంటే ఒంటి మీద క్రికెటర్లు వేసుకునే డ్రెస్స్‌, తలకు హెల్మెట్‌, చేతికి గ్లౌజ్‌ వేసుకుని ఇంట్లో ప్రాక్టీస్‌ చేస్తాడు. అది కూడా ఒక ఇరుకు సందులో షాట్‌ ఆడతాడు. అంతే వెంటనే పరుగు తీయడానికి మాత్రం పక్కనే ఉన్న ట్రెడ్‌మిల్‌ ఎక్కేస్తాడు. ఇది చూస్తే ఇలా కూడా క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేయొచ్చా అనిపిస్తోంది.

ఇక సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా కెపీ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దాని కింద వీడియోలో ఉన్న‌ది ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని, అయితే అత‌డు మాత్రం గొప్ప జీనియ‌స్ రాసుకొచ్చాడు. త‌న‌కు ఈ వీడియో వాట్స‌ప్‌లో వ‌చ్చింద‌ని పీట‌ర్స‌న్ తెలిపాడు. ఈ వీడియో చూసిన నెటీజ‌న్లు స‌ర‌దాగా స్పందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో క్రికెట్ ఎలా ఆడాలో మాకు నేర్పావు అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా.. ఓ క్రికెట్ వీరాభిమాని.. నీ ఐడియా అదుర్స్‌.. అంటూ మ‌రో అభిమాని పోస్టు చేశాడు.

Next Story
Share it