హైదరాబాద్‌: నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణం జరిగింది. మైనర్‌ బాలికపై ఓ ఫోటో గ్రాఫర్‌ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫొటో కోసం వెళ్లిన మైనర్‌ బాలికపై సలీం అత్యాచారానికి యత్నించాడు. సైనిక్‌పురిలోని ఆర్‌ఎస్‌ డిజిటల్‌ ఫొటో స్టూడియోలో ఫొటో కోసం ఓ మైనర్‌ బాలిక వెళ్లింది. ఆ బాలిక పట్ల ఫొటో గ్రాఫర్‌ సలీం అసభ్యకరంగా ప్రవర్తించాడు. మెల్లగా బాలికపై చేతులు వేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుడు సలీం నుంచి బాలి్ తప్పించుకుంది. స్టూడియో అరుచుకుంటూ బాలిక బయటికి పరుగులు తీసింది.

బాలిక ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న స్థానికులు స్టూడియో యజమాని సలీంను కొట్టారు. జరిగిన ఘటనపై బాలిక తల్లి స్థానిక నేరెడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గాయాలపాలైన సలీం ప్రస్తుతం ఓ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నిందితుడు కఠినంగా శిక్షించాలని బాధితురాలి బంధువుల డిమాండ్‌ చేస్తున్నారు.

మహిళలు ఒంటరిగా కనబడితే చాలు మానవమృగాలు బరితెగిస్తున్నాయి. తమ కామవాంఛను తీర్చుకునేందుకు దేనికైనా వెనుకాడడం లేదు. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మనిషి రూపంలో ఉన్న మృగాల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అయిఘాత్యాలకు పాల్పడుతున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.