కరోనా సమయంలో అండగా నిలిచిన పి.ఎఫ్. డబ్బులు
By సుభాష్ Published on 28 July 2020 2:16 PM ISTలాక్ డౌన్ సమయం ఎంతో మందికి ఉద్యోగాలు పోయాయి, చాలా మంది జీతాల్లో కోతలు విధించారు. ఇలాంటి సమయంలో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు ఎంతో మందికి సహాయపడ్డాయి. 30000 కోట్ల రూపాయల ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు నాలుగు నెలల్లోనే తీసుకున్నారని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈ.పి.ఎఫ్.ఓ.) తెలిపింది. ఏప్రిల్ నెల నుండి జులై నెల మూడో వారం మధ్యలో ఈ డబ్బులు ఉద్యోగస్థులు తీసుకున్నారు. సాధారణంగా ఈ సమయాల్లో తీసుకునే డబ్బు సంఖ్య తక్కువగానే ఉంటుందట.. కానీ ఈ ఏడాది చోటుచేసుకున్న ఘటనల కారణంగా ప్రావిడెంట్ ఫండ్ కావాలని పెద్ద ఎత్తున ఉద్యోగులు కోరుకున్నారు.
మూడు మిలియన్ల మంది ఉద్యోగులు సాధారణంగా 8000 కోట్ల రూపాయలు విత్ డ్రా చేసుకున్నారు. 5 మిలియన్ల మంది 22000 కోట్ల రూపాయలను మెడికల్ అడ్వాన్స్ కింద తీసుకున్నారని ఈ.పి.ఎఫ్.ఓ. అధికారులు తెలిపారు.
కోవిద్ విండో కింద విత్ డ్రాలు చేసుకోవచ్చని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ తెలపడంతో పెద్ద ఎత్తున విత్ డ్రాలు జరిగాయి. కోవిద్ కేసులు పెరిగే కొద్దీ ఈ విత్ డ్రాలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వ అధికారి తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో పిఎఫ్ ఉపసంహరణ సంఖ్య గణనీయంగా పెరగడంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ క్లెయిమ్‌ల ప్రాసెసింగ్ విషయంపై అధిక భారం పడుతుండడంతో ఈపిఎఫ్‌ఓ కార్యాలయాలలో ఉద్యోగుల కొరత ఏర్పడటంతో పెన్షన్ విత్ డ్రాలు ఆలస్యం అయ్యాయి. రిటైర్మెంట్ ఫండ్స్ బాడీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫుల్ ఆటోమేటిక్ క్లెయిమ్ సెటిల్మెంట్ సిస్టం ను తీసుకుని వచ్చింది. దీంతో కోవిడ్-19 పిఎఫ్ విత్ డ్రా వ్యవధి ముందు 10 రోజుల సమయం పట్టేది. కానీ ఈ ఏఐ సౌకర్యం వల్ల కేవలం 3 రోజుల్లో పిఎఫ్ విత్ డ్రా అవుతోంది.