భగ్గుమన్న పెట్రోల్ ధరలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 9:17 AM GMT
భగ్గుమన్న పెట్రోల్  ధరలు..!

ఢిల్లీ: అనుకున్నట్లే జరిగింది. పెట్రోల్ ధరలు భగ్గుమన్నాయి. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరగడం..దేశీయ పెట్రోల్ రంగాన్ని ప్రభావితం చేసింది. బుధవారం పెట్రోల్ ధర లీటర్‌పై 25 పైసలు, డీజిల్ పై 24 పైసలు పెరిగింది. బడ్జెట్ తరువాత ఇంధన ధరలు ఫస్ట్ టైమ్ మోతమోగాయి.

తాజా పెట్రోల్ ధరలు పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.42, డీజిల్ రూ.65.82కు చేరింది. ఇక..కొల్‌కతాలో పెట్రోల్ ధర రూ.75.14 పైసలు ఉండగా..డీజిల్ ధర రూ. 68.23గా ఉంది. ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 78.10ఉండగా డీజిల్ ధర రూ. 69.04గా ఉంది.

సౌదీ అరేబియాలో ఆరామ్ చమురు కేంద్రంపై యెమెన్ ఉగ్రవాదులు డ్రోన్‌ దాడులతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మధ్య ఆసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో చమురు ధరలు మరింత పెరిగే అవకాశముంది. దీంతో మన దగ్గర విదేశీ మారక ద్రవ్యనిల్వలకు కోత పడే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అసలే ఆర్ధికమాంద్యం చుట్టుముట్టుతున్న వేళ..చమురు ధరలు పెరగడం ఆర్థికంగా ఇబ్బందే అంటున్నారు ఆర్ధిక వేత్తలు.

Next Story