బ్రేకింగ్: వాహనదారులకు షాక్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
By సుభాష్ Published on 7 Jun 2020 4:15 PM IST
దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, ఢీజిల్ ధరలు పెంచాయి. చివరిగా మార్చి 16న సవరించిన పెట్రోల్, ఢీజిల్ ధరలను తాగాజా ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 రోజుల తర్వాత ధరలు పెరగడంతో వాహనదారులకు భారం కానుంది. లాక్‌డౌన్ సడలింపుల కారణంగా ఆయిల్‌కు డిమాండ్ భారీగా పెరిగింది.
క్రూడాయిల్ కూడా బ్యారెల్ ధర రూ. 40 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ లీటరుపై 60 పైసల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక లాక్‌డౌన్ కారణంగా ఆదాయం కోల్పోయినందున కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ విధించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర శుక్రవారం 42 డాలర్లు పలికింది. ఇక లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం దాదాపు 46శాతంకు పైగా పడిపోయింది.
ప్రముఖ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటర్‌కు)
♦ హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.74.61, డీజిల్ రూ.68.42
♦ ఢిల్లీలో పెట్రోల్ రూ. 71.86, డీజిల్ రూ.68.76
♦ ముంబైలో పెట్రోల్ రూ. 78.90, డీజిల్ రూ.68.798.79
♦ చెన్నైలో పెట్రోల్ రూ.76.08, డీజిల్ రూ. 68.75
♦ బెంగళూరులో పెట్రోల్ రూ.74.18, డీజిల్ రూ.66.55