హైదరాబాద్‌: దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తీసిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం ట్రైలర్స్‌తో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అయ్యింది. తనని అవమానించేలా కొన్ని సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయంటూ కేఏ పాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 29న ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదల నిలిపివేయాలంటూ కే.ఏ పాల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్రమంత్రిత్వ శాఖ, సెన్సార్‌ బోర్డు ఉన్నాయి. కే.ఏ పాల్‌ పిటిషన్‌పై మరి కొద్ది సేపటిలో హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే రాజకీయాలే పరమావధిగా బతికే ఇద్దరు నాయకుల గురించి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం తీసినట్లుగా తెలుస్తోంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.