దిగులెందుకు.. ఆ కరోనా వైరస్.. ఈ కరోనా బీరు

By Newsmeter.Network  Published on  29 Jan 2020 1:29 PM IST
దిగులెందుకు.. ఆ కరోనా వైరస్.. ఈ కరోనా బీరు

అందరిది ఓ బాధ అయితే ఆ కంపెనీది మరో బాధ. ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్‌ వణికిస్తోంది. అందరి కంటే ఎక్కువగా ఓ కంపెనినీ ఈ వైరస్ తీవ్రంగా భయపెడుతోంది. ఎందుకు అంతలా ఆ కంపెనీ భయపడుతోంది. ఆ కంపెనీ ఉద్యోగులకు ఎవరికైనా ఈ వైరస్‌ సోకిందా అనుమానం మీకు రావచ్చు.

కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆ కంపెనీ తయారు చేసే బీరు అమ్మకాలకు ఈ వైరస్ గండికొడుతుందంటా. అదేంటి బీరుకు వైరస్ సంబంధం ఏమిటీ..? అనేగా మీరు అడిగేది..? అయితే ఇది చదవండి..

భారత్ లో ఇప్పటి వరకు కరోనా వైరస్‌ కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదు. అయితే ఈ వైరస్‌ ఎటునుంచి వ్యాపిస్తుందోనని ప్రజల్లో భయాలు నెలకొన్నాయి. ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందన్న దానిపై రకరకాల వదంతులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వదంతులే ఆకంపెనీ బీర్ల అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోందట.

కరోనా అనే బ్రాండ్‌ పేరుతో ఓ బీరు కంపెనీ ఉంది. ప్రస్తుతం ఉన్న వైరస్‌ పేరు ఆ కంపెనీ పేరు ఒకటే కావడంతో ఆ బీరు తాగితే వైరస్‌ వస్తుందనే వదంతులు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయట. దీంతో బీరు ప్రియులు ఆ బ్రాండ్‌ కొనుగోలుకు వెనుకంజ వేస్తున్నారట.

అంతేకాదండోమ్ నిజంగా ఈ బీరు తాగితే కరోనా వైరస్ సోకుతుందా అని గూగుల్ లో సర్చ్‌ చేస్తున్నారు. కరోనా వైరస్, కరోనా బీరుతో సోకుతుందా అని టైప్ చేస్తూ వెబ్ సైట్లలో వెతుకుతున్నారు. ఈ ప్రశ్నలను సందిస్తున్న వారిలో ముఖ్యంగా భారత్‌లోని కరోనా బ్రాండ్ బీరు ప్రియులతోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా ప్రజలు కూడా ఉన్నారు.

Next Story