గాంధీ సిద్ధాంతాలతోనే ప్రజల్లో మార్పు : విష్ణువర్దన్ రెడ్డి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Oct 2019 6:43 PM ISTవిజయవాడ: గాంధీజీ ఆశయాలను భావితరాలకు తెలియ చెప్పడమే మోదీ సంకల్పమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అందుకోసమే ఈ 'సంకల్ప యాత్ర' అన్నారు. గాంధీజీ సిద్దాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని ప్రధాని మోదీ నిర్ణయించారని చెప్పారు. మోదీ 'సంకల్ప యాత్ర'కు ప్రజల నుంచి మద్దతు లభిస్తుందన్నారు విష్ణవర్ధన్ రెడ్డి.
ప్రపంచ దేశాలు గాంధీజీని ఆదర్శంగా తీసుకున్నాయి: సుజనా చౌదరి
మహాత్మ గాంధీ ఆశయాలను నేడు ఎంత వరకు పాటిస్తున్నామని ప్రశ్నించారు ఎంపీ సుజనా చౌదరి. ప్రపంచ దేశాలు గాంధీజీని ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసి మోదీ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్య తెచ్చారన్నారు. అవినీతి డబ్బుతో రాజకీయాల్లోకి వ్యవస్థను నాశనం చేస్తున్నారని సుజనా అభిప్రాయపడ్డారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి జాతీయ పార్టీలతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రపంచంలో బీజేపీ అతి పెద్ద పార్టీగా చరిత్ర సృష్టించిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను సాగనంపి బీజేపీకి పట్టం కట్టాలని సుజనా పిలుపునిచ్చారు.