అమెరికాలోని కాలిఫోర్నియాకు ఉత్తర దిక్కునున్న సముద్ర తీరంలో వింత ఘటన చోటుచేసుకుంది. కొన్ని వేల సంఖ్యలో చేపలు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ? అసలు వింత ఇదే. ఈ ఫిష్ ను అక్కడి వాసులు పెనిస్ ఫిష్ గా పిలుస్తారు. ఇది అచ్చం పురుషాంగాన్ని పోలి ఉండటమే వింత. అచ్చం మానవ పురుషాంగాన్ని పోలి ఉండే ఈ ఫిష్ లు ఒకేసారి వేల సంఖ్యలో సముద్ర తీరానికి కొట్టుకు రావడంతో అక్కడి జనం వీటిని చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ సముద్రజీవులకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.California Penis Shaped Fish 2

సుమారుగా 10 ఇంచుల పొడవుండే ఈ జీవులు సముద్రపు అడుగు భాగంలో జీవిస్తుంటాయి. వీటిని ”ఫాట్ ఇన్ కీపర్ వార్మ్” అని కూడా పిలుస్తారు కానీ పురుషాంగాన్ని పోలి ఉండటంతో పెనిస్ ఫిష్ గానే పేరు తెచ్చుకున్నాయి. ఇటీవల కాలంలో ఆ సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా వచ్చిన భారీ అలలకు ఈ జీవులు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయట. ఈ జీవుల ముందుభాగంలో ఉండే మ్యూకస్ ద్రవం ద్వారా బాక్టీరియా, సముద్ర నాచును ఆహారంగా తీసుకుంటూ జీవిస్తుంటాయి. ఈ ఫిష్ లను చైనీయులు ఎక్కువ ఇష్టంగా తింటారట.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.