కాలిఫోర్నియా సముద్రతీరంలో పురుషాంగాన్ని...
By రాణి Published on 15 Dec 2019 4:38 AM GMTఅమెరికాలోని కాలిఫోర్నియాకు ఉత్తర దిక్కునున్న సముద్ర తీరంలో వింత ఘటన చోటుచేసుకుంది. కొన్ని వేల సంఖ్యలో చేపలు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా ? అసలు వింత ఇదే. ఈ ఫిష్ ను అక్కడి వాసులు పెనిస్ ఫిష్ గా పిలుస్తారు. ఇది అచ్చం పురుషాంగాన్ని పోలి ఉండటమే వింత. అచ్చం మానవ పురుషాంగాన్ని పోలి ఉండే ఈ ఫిష్ లు ఒకేసారి వేల సంఖ్యలో సముద్ర తీరానికి కొట్టుకు రావడంతో అక్కడి జనం వీటిని చూసేందుకు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ సముద్రజీవులకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సుమారుగా 10 ఇంచుల పొడవుండే ఈ జీవులు సముద్రపు అడుగు భాగంలో జీవిస్తుంటాయి. వీటిని ''ఫాట్ ఇన్ కీపర్ వార్మ్'' అని కూడా పిలుస్తారు కానీ పురుషాంగాన్ని పోలి ఉండటంతో పెనిస్ ఫిష్ గానే పేరు తెచ్చుకున్నాయి. ఇటీవల కాలంలో ఆ సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా వచ్చిన భారీ అలలకు ఈ జీవులు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయట. ఈ జీవుల ముందుభాగంలో ఉండే మ్యూకస్ ద్రవం ద్వారా బాక్టీరియా, సముద్ర నాచును ఆహారంగా తీసుకుంటూ జీవిస్తుంటాయి. ఈ ఫిష్ లను చైనీయులు ఎక్కువ ఇష్టంగా తింటారట.