'టీ' లోనూ బోలెడు మార్పులు

By సుభాష్  Published on  15 Dec 2019 5:16 AM GMT
టీ లోనూ బోలెడు మార్పులు

ముఖ్యాంశాలు

  • నేడు అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం
  • కాలానుగుణంలో టీలో బోలెడు మార్పులు

టీ లేనిదే మనలో చాలా మందికి తెల్లారదంటే అతిశయోక్తి కాదు. ఉదయాన్నే ‘టీ’ తాగకపోతే మనసు అదోలా ఉంటుంది కొందరిలో. దీంతో పల్లె, పట్టణాల్లో ప్రతి గల్లీలోనూ టీ స్టాళ్లు దర్శనమిస్తున్నాయి. డిసెంబర్ 15న అంతర్జాతీయ ‘టీ’ దినోత్సవం సందర్భంగా ‘న్యూస్ మీటర్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఉదయాన్నే టీ కొట్టుకు చేరి... టీ తాగుతూ నలుగురితో కలసి ముచ్చట్లు చెప్పుకుంటే ఆ ఆనందమే వేరబ్బా. మరికొందరు టీ కప్పు చేతపట్టుకుని న్యూస్ పేపరులో మునిగిపోతారు. టీ కొట్టులో ఉంటే ఎవరి ప్రపంచంలో తాముంటారు. సాయం వేళల్లోనూ టీ కొట్టుల దగ్గర సందడి సందడిగా ఉంటుంది. ఈ చలికాలంలో అయితే టీలు తాగుతుంటూ ముచ్చట్లలో మునిగిపోతారు. కొన్ని కొన్ని షాపులు కొన్ని ప్రాంతాల్లో ఎక్కవగా వెలుస్తుంటే.. టీ స్టాళ్లు మాత్రం లేని ఏరియా అంటూ ఉండదు. పలువురికి టీ స్టాళ్లు ఉపాధి మార్గంగా మారాయి. ప్రతి ఒక్కరికకి ఉదయాన్నే లేవగానే టీ తాగందే ఏమీ తోచదు కొందరికి. ఒత్తిడిగా ఉన్నా, ఆలోచనలు తట్టకపోయినా.. తలనొప్పిగా ఉన్నా ముందు వెళ్లేది టీ కొట్టుకే. మనకు టీ అలవాటు చేసింది బ్రిటీష్ వాళ్లు. మన దినచర్యలోనూ ఓ భాగమైంది. వెనుకటి రోజుల్లో ఇంటికి ఎవరొచ్చినా మంచినీళ్లో, మజ్జిగో అందించేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. ఇంటికి అతిథిలు వస్తే టీనో, కాఫీనో ఇవ్వడం మర్యాదగా మారిపోయింది. నేడు అనేక రకాల్లో లభ్యమవుతున్న టీలో అత్యంత ఖరీదైనవి కూడా ఉన్నాయి

కాలానికి అనుగుణంగా...

కాలనికి అనుగుణంగా టీలోనూ బోలెడు మార్పులు వచ్చాయి. గతంలో కేవలం టీ మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరిలో ఆరోగ్య స్పృహ పెరగడంతో ఆ మేరకు పలు రకాలు... రుచులు అందుబాటులోకి వచ్చాయి. బ్లాక్‌టీ, లెమన్‌ టీ, యల్లో టీ, గ్రీన్‌ టీ, బాదంటీ, హెర్బల్‌ టీ, ఇరానీ ఛాయ్‌ ఇలా ఎన్నో రకాల టీ రుచులు అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల కోరిక మేరకు ఆయా రకాలను కొన్ని దుకాణాల వారు ప్రత్యేకంగా అందిస్తున్నారు. పట్టణంలోని దుకాణాల్లో కార్మికుల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు ప్రతి ఒక్కరు రోజుకు కనీసం మూడు టీలైనా తాగుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మంది యువకులు టీ, బిస్కెట్‌ దుకాణాలను ఉపాధిమార్గాలుగా ఎంచుకొని మంచి లాభాలు గడిస్తున్నారు. మంచి ఆదాయమూ సంపాదిస్తున్నారు. చూసేందుకు టీ కొట్టే అయినా… మంచి లాభాలనే ఇస్తున్నాయి.

తేనీటి వినియోగంలో భారత్‌ మొదటి స్థానం

ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో చైనా ప్రథమస్థానంలో ఉంటే... తేనీటి వినియోగంలో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. 2005 డిసెంబరు 15న తొలిసారిగా ప్రపంచ తేనీటి దినోత్సవాన్ని దిల్లీలో నిర్వహించారు. తొలినాళ్లలో ఆకులను మరిగించి కషాయంలా ప్రారంభమైన తేనీరు లేదా టీ... కాలక్రమంలో పాలు, పంచదార, యాలుకలు, అల్లం తదితరాలను తనలో కలుపుకుంది.

ఆరోగ్యానికి..

తలనొప్పికి లెమన్‌టీ, జీర్ణక్రియ మెరుగుకు అల్లంటీ, ఉత్తేజానికి ఇలాచీ టీ, ఆరోగ్యానికి బ్లాక్‌టీ, గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ, రుగ్మతల నివారణకు తులసిటీ, మసాలా టీ ఇలా చాలా రకాలు అందుబాటులోకి వచ్చాయి.

Next Story