వాట్సాప్ లో పెగసస్ స్పైవేర్... దేశంలో కలకలం!!

By సత్య ప్రియ  Published on  2 Nov 2019 5:43 AM GMT
వాట్సాప్ లో పెగసస్ స్పైవేర్... దేశంలో కలకలం!!

వాట్సాప్ లో పెగసస్ స్పై వేర్ తో సమాచార చోరీ జరుగుతుండటంపై దేశంలో కలకలం రేగుతోంది. మన దేశంలో ఇలా సమాచార తస్కరణకి గురైనవారు 20 మందికి కి పైగా ఉన్నట్టు సమాచారం. వీరిలో పాత్రికేయులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు ఉన్నారు.

ఈ జాబితాలో తెలంగాణ కు చెందిన 44 ఏళ్ల న్యాయవాది బల్ల రవీంద్రనాథ్ కూడా ఉన్నారు. తెలంగాణ ప్రధాన న్యాయస్థానంలో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నారు రవీంద్రనాథ్‌. రాజకీయ ఖైదుల విడుదల కోసం ఒక స్వచ్చంద సంస్థ ను నడుపుతున్నారు.

Whatsapp Image 2019 11 01 At 5.13.40 Pm 1

న్యూస్ మీటర్ తో రవీంద్రనాథ్ మాట్లాడుతూ. ..అక్టోబర్ 17న..మీ ఫోన్‌ నిఘాలో ఉందని, కెనడా కి చెందిన పరిశోధకుడి నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చిందని చెప్పారు. ముప్పు పొంచివుందని హెచ్చరించాడని తెలిపారు."ఆ పరిశోధకుడు అక్కడితో ఆగలేదు, నా వాట్సాప్ పై నిఘా ఉందని చెప్తూనే ఉన్నాడు. నాకు కాల్ చేయడానికి కూడా చాలా సార్లు ప్రయత్నించాడు. కాని.. నేను ఫోన్ ఎత్తలేదు, తిరిగి కాల్ చేయలేదు" అని రవీంద్రనాథ్ అన్నారు.

బల్ల రవీంద్రనాథ్, కెనడా పరిశోధకుడు జాన్ స్కాట్ మధ్యన జరిగిన వాట్సాప్ సందేశాలు న్యూస్ మీటర్ కు లభించాయి.

వివరాలు:

జాన్ స్కాట్: హలో రవి, సిటీజెన్ ల్యాబ్, టొరాంటో యూనివర్సిటీ, కెనడాలో నేను పరిశోధకుడిగా పని చేస్తున్నాను. సమాచార తస్కరణలపై సిటిజన్ ల్యాబ్ పరిశోధనలు చేస్తోంది. మీరు కింది లింకు ను క్లిక్ చేస్తే, మీరు మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు.

బల్ల రవింద్రనాథ్: నేను భారత్ కి చెందినవాడిని.

జాన్ స్కాట్: మీ ఫోన్‌ పైన స్పైవేర్ అటాక్ జరిగి ఉండవచ్చు, మేము కేవలం మీ ఫోన్‌ రక్షణను కోరుతున్నాం. మా పరిశోధనల ద్వారా మీ గురించి చాలా కొద్దిగా తెలుసుకున్నాం. అయితే ..మీకు డిజిటల్ మాధ్యామాలలో హాని వాటిల్లుతోందని మేము భావిస్తున్నాం.

Whatsapp Image 2019 11 01 At 5.14.02 Pm 292x600

Whatsapp Image 2019 11 01 At 5.14.36 Pm 292x600

రవీంద్రనాథ్ మొదట జాన్ స్కాట్ హెచ్చరిక ను నమ్మకపోయినా, అక్టోబర్ 29 న, ఈ విషయంపై వాట్సాప్ నుంచి అధికారిక సందేశం రావడంతో జాన్ స్కాట్ ని వెంటనే సంప్రదించారు. ఆయన ఈ అటాక్ ని దృవీకరిస్తూ ఎందరో ఈ ముప్పును ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.

"ప్రభుత్వాన్ని ఎదిరించిన ఎందరో మానవ హక్కుల కార్యకర్తలకు ఈ ముప్పు ఉంది. స్వేచ్చను అరికట్టడానికి ప్రభుత్వం చేసిన కుట్ర ఇది. నేను మానవ హక్కుల న్యాయవాది, కార్యకర్త ను. 2017 ఒక రాష్ట్ర ప్రభుత్వం నాపైన, ఇతర కార్యకర్తల పైన తప్పుడు కేసులు బనాయించి జైలులో వేసింది. చత్తీస్ గఢ్‌లో ఆదివాసీలపైన జరుగుతున్న అత్యాచారాల గురించి మేము పరిశోధనలు చేస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. 6 నెలలు మమ్మల్ని జైలులో ఉంచారు.” అని బల్ల రవీంద్రనాథ్ వాట్సాప్‌ సందేశంలో చెప్పారు.

కొద్దిరోజుల క్రితం, తెలంగాణ ప్రభుత్వం కొన్ని సామూహిక సంస్థల నేతలు, కార్యకర్తలు, న్యాయవాదుల పేర్లు ప్రకటించింది. ఈ జాబితాలో బల్ల రవీంద్రనాథ్, ఆయన భార్య సావిత్రి (న్యాయవాది) పేర్లు కూడా ఉన్నాయి. వీరు చట్టవ్యతిరేక చర్యలలో పాల్గొంటున్నారనే అభియోగం పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు.

గురువారం సుమారు 17 మంది మానవ హక్కుల కార్యకర్తలపై ఇజ్రాయిల్ సాఫ్ట్ వేర్ పెగసస్ నిఘా ఉందని దృవీకరించారు. ఇజ్రాయిల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ రూపొందించిన స్పైవేర్ ఇది. భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కొంతమందిని పెగసస్ మాల్‌వేర్‌తో టార్గెట్ చేశారు హ్యాకర్లు.

Pegasus Mobile Spyware Featured 1

అసలేంటి ఈ పెగసస్ మాల్‌వేర్? ఎంత ప్రమాదకరం?

యూజర్ల మెసేజెస్, మెయిల్స్ చెక్ చేయడం దగ్గర్నుంచి కాల్స్ వినడం వరకు పూర్తిగా నిఘా పెడుతుంది పెగసస్ మాల్‌వేర్. అంతేకాదు... మీ బ్రౌజర్ హిస్టరీని చెక్ చేస్తూ మీ డిజిటల్ లైఫ్‌ను పూర్తిగా తన కంట్రోల్‌కు తెచ్చుకుంటుంది.

వాట్సప్‌ యూజర్లపై పెగసస్ మాల్‌వేర్ ఎటాక్ చేసిందని యూఏఈకి చెందిన మానవ హక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్ మొదటిసారిగా గుర్తించారు. పెగసస్ మాల్‌వేర్‌కు టార్గెట్ అయిన వ్యక్తుల్లో తను కూడా ఒకరు. ఆయన ఫోన్‌కు అనుమానాస్పద సందేశాలు వచ్చాయి. అందులో ఉన్న లింక్స్‌పై అనుమానం వచ్చింది. దీంతో ఆయన సిటిజన్ ల్యాబ్‌కు చెందిన సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్‌కు ఆ సందేశాలను ఫార్వర్డ్ చేశారు. అది పెగసస్ మాల్‌వేర్‌ టార్గెట్‌గా సదరు సైబర్ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది.

ఓ డివైజ్‌ని పూర్తిగా టార్గెట్ చేసేలా పెగసస్ మాల్‌వేర్‌ను రూపొందించినట్టు డిజిటల్ సెక్యూరిటీ కంపెనీ క్యాస్పర్‌స్కీ వెల్లడించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే, 2017లో స్పైవేర్ ను వాడుకొని సిఐఏ ఏజెంట్లు ఆధార్ జాబితాలను పొందుతున్నారని గ్రేట్ గేంఇండియా సంస్థ వారు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రాస్ మ్యాచ్ అనే సంస్థ తయారు చేసిన స్పైవేర్ ను సిఐఏ వారు ఉపయోగించారు.

అప్పుడు క్రాస్ మ్యాచ్ సంస్థ అధికారులు ఫ్రాన్సిస్కో పార్ట్ నర్స్, ఈ ఎన్ఎస్ఓ సంస్థ కూడా వారిదే. ఫ్రాన్సిస్కో పార్ట్ నర్స్ సంస్థ భారత్ లో జరిపే లావదేవీల పై విస్తృతమైన విచారణ జరపాల్సి ఉంది.

Next Story