సొంతూళ్లకు పంపించాలని వలస కూలీల ఆందోళన.. స్పందించిన అధికారులు
By సుభాష్ Published on 5 May 2020 2:06 PM ISTపెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పని చేస్తున్న వలస కార్మికులు నిరసనకు దిగారు. తమ స్వస్థలాలకు వెళ్తామని అధికారులకు మొరపెట్టుకున్నా ఏ మాత్రం స్పందించడం లేదని వారు ఆరోపించారు. లాక్‌డౌన్ కారణంగా ఉపాధి లేక తినేందుకు తిండి లేక నానా అవస్థలు పడుతున్నామని, మా లాంటి వారిని సొంతూళ్లకు పంపించాలని కేంద్రం అనుమతి ఇచ్చినా అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపించారు.
Also Read
మే 7 నుంచి స్వదేశానికి భారతీయులుదీంతో స్పందించిన అధికారులు బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన 200 మంది వలస కూలీలను స్వస్థలాలకు పంపించారు. ఎమ్మెల్యే కొరుకంటి చందర్, డీసీపీ రవిందర్ సమక్షంలో ప్రత్యేక అనుమతితో మూడు వాహనాల్లో తరలించారు. దీంతో కూలీలు హర్షం వ్యక్తం చేశారు.
Next Story