ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు భార‌త్‌లో కూడా ప్ర‌వేశించింది. దేశ‌వ్యాప్తంగా ప‌దుల సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో ఉన్న ఏ ఒక్క‌రూ ఈ వైర‌స్ బారిన ప‌డ‌క‌పోగా.. విదేశాల‌నుండి వ‌చ్చిన వారితో మాత్రం మ‌న‌కూ అపాయం పొంచివుంద‌నేది స‌త్యం. ఇప్ప‌టివ‌ర‌కూ పాజిటివ్‌గా న‌మోద‌యిన కేసులు కూడా అలాంటివే..

ఇక‌ పేటీఎమ్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటీవ్ వచ్చినట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. పేటీఎమ్ కు చెందిన ఓ ఉద్యోగి ఈ మధ్య ఇటలీకి వెళ్లి వచ్చినట్లు తెలిపారు. అయితే.. అతనికి ఈ రోజు కరోనా టెస్ట్ చేయ‌గా రిపోర్ట్ పాజిటీవ్ గా వచ్చింది. సదరు ఉద్యోగి గుర్ గావ్ కు చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. అయితే ఆ వ్యక్తి యొక్క టీం మెంబర్స్ అందరికీ కరోనా టెస్ట్ చేయిస్తున్నట్లు తెలిపారు పేటీఎమ్ అధికారులు. ఇప్పటి వరకు దేశంలో 28కరోనా కేసులు నమోదయ్యాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.