జైలులో నిద్ర కూడా పట్టలేదు : బాలీవుడ్ నటి
By సుభాష్ Published on 18 Dec 2019 6:27 PM ISTగాంధీ-నెహ్రు కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో బాలీవుడ్ నటి పాయల్ రోహత్గిని రాజస్తాన్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2008 ఐటి చట్టం కింద ఆమెపై పలు కేసులు నమోదు చేశారు. ఆమె మంగళవారం సాయంత్రం బుండి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. తనను బయటకు తీసుకురావాలనే ప్రయత్నించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జైల్లోచాలా భయపడ్డానని, ప్రస్తుతం చాలా ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు పాయల్. జైల్లో రాత్రి భయంతో నిద్ర కూడా పట్టలేదని తెలిపింది.
తాను ఎప్పుడు దేశం గురించి ఆలోస్తానని, కానీ అకారణంగా జైలుకెళ్లాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్తులో మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటానని చెప్పుకొచ్చారు పాయల్. నెహ్రు కుటుంబంపై నేను చేసిన వీడియో ఇంత పెద్ద చిక్కులు తీసుకువస్తుందని కలలోకూడా అనుకోలేదని, చట్టాలపై పెద్దగా అవగాహన లేదని పేర్కొంది.
జైలులో గడిపిన అనుభవం గురించి మీడియా పలు ప్రశ్నలు సంధించారు. తనకు లేడీస్ జనరల్ వార్డ్‌లో ఉంచారని,అక్కడ చ ఆలా చలిగా ఉండటంతో రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపినట్లు చెప్పారు. అక్కడి పరిస్థితులు చూస్తే చాలా భయమేసిందని, జైలులో ఆహారం అసలు బాగాలేదని, స్పైసీ ఫుడ్ కోరుకునేవారికి మాత్రం బాగుంటుందని తెలిపారు. మొత్తం మీద జైలులో నరకం అనుభవించానని చెప్పుకొచ్చింది నటి. తాను జైలుకెళ్లడం మొదటి సారి అని,ఇదే చివరి సారి కూడా అనుకుంటా.. అంటూ వివరించింది.