ఇలా.. గ్యాప్ లేకుండా వాడితే ఎలా అయ్య‌గారూ.!

By అంజి  Published on  30 Jan 2020 2:44 AM GMT
ఇలా.. గ్యాప్ లేకుండా వాడితే ఎలా అయ్య‌గారూ.!

అబ‌బ‌బ‌బ‌బ‌బా.., ఇలాంటి వాడ‌కం నెవ్వరు బిఫోరు - ఎవ్వ‌రు ఆఫ్ట‌రు అయ్య‌గారూ..! వాడ‌కానికి మారు పేరేదైనా ఉందంటే అది మీరే. చూస్తుంటేనే ఇట్టే తెలిసిపోతుంది. బ్యాక్, ఫ్రెంట్ పార్టులు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. ఆ గేర్ రాడ్డును ఇన్ని రోజులు ఎట్టా వాడారు సామి. ఇలా లాగితే అలా వ‌చ్చేస్తోంది. ఏడాది గ‌డ‌వ‌క మునుపే షోరూమ్ బండిని షెడ్డు బండి మాదిరి మార్చేశారు. ఏదైనా వాడే స‌మ‌యంలో మ‌ధ్య మ‌ధ్య‌లో గ్యాప్ ఇస్తుండ‌డ‌య్యా..! ఆటికి మంచిది.. మీకూ మంచిది.

ఒక్క కారు గురించి ఇన్ని జాగ్ర‌త్త‌లు చెబుతున్నాడంటే కార్లు రిపేరు చేసే ర‌మ‌ణ‌కు మార్కెటింగ్ మేనేజ‌ర్ సుధాక‌ర్ అంటే ఎంత గౌర‌వ మ‌ర్యాదో ఇట్టే ప‌సిగట్టొచ్చు. ఆఫీసుకు వెళ్తుండ‌గా కారు ట్ర‌బుల్ ఇవ్వ‌డంతో ఓ న‌లుగురు వ్య‌క్తుల‌తో తోయించుకుంటూ ర‌మ‌ణ కారు రిపేరు సెంట‌ర్‌కు తీసుకొచ్చాడు. వ‌చ్చీ రాగానే చ‌నువు కొద్దీ, ర‌మ‌ణా కారు రిపేరు చెయ్యాల్రా..! ఆఫీసుకు లేట‌వుతాద్ది అంటూ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలోని డైలాగ్‌ను కాస్త మార్చి చెప్పాడు.

సుధాక‌ర్ వాయిస్ విన్న ర‌మ‌ణ న‌వ్వుకుంటూ షెడ్డులోని కారు రిపేరును మ‌ధ్య‌లో ఆపేసి కుర్చీతో బ‌య‌ట‌కొచ్చాడు. సుధాక‌ర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి చెప్పండ‌య్యా అంటూ కారు రిపేరు గురించి వాక‌బు చేశాడు. అరె కొని ఏడాది కూడా కాలేదు. ఇంత‌లో ట్ర‌బుల్ ఇస్తుంది. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో కొన్న కారురా ఇది. క‌నీసం ఐదు సంవ‌త్స‌రాల‌న్నా రాకుండానే ఇలా ఇబ్బంది పెడుతుందేంట్రా అంటూ త‌న మ‌న‌సులోని బాధ‌ను ర‌మ‌ణ‌తో చెప్ప‌సాగాడు.

అయ్యా! ఏమ‌న్నా అంటే అన్నానంటారు కానీ.. మీరెప్పుడైనా దీన్ని కారులా చూశారా? నిజం చెప్పాలంటే సైకిల్ క‌న్నా ఘోరంగా వాడారు. అదేమంటే చిన్న దూరానికి కూడా కారేసుకు పోవ‌డం. అడిగితేనేమో ఎంతైనా మార్కెటింగ్ మేనేజ‌ర్‌ను క‌ద‌రా.. ఆ మాత్రం బిల్డ‌ప్ ఇవ్వ‌క‌పోతే ప్రొడ‌క్స్ట్ సేల్స్ కావంటారు. ఇలా మీ ప్రొడ‌క్ట్సే మీ పొట్ట కొట్టేలా మ‌ళ్లీ కారుకు ల‌క్ష‌లు ల‌క్ష‌లు పోసేలా చేశాయి. దీనిక‌య్యే ఖ‌ర్చుకు ఇంకొంత క‌లిపి కొత్త కారును కొనుక్కోవ‌డం మంచిది అంటూ త‌న మ‌నుషుల‌తో కారును తోయిస్తూ షెడ్డుకు చేర్చాడు ర‌మ‌ణ‌.

ఫ‌స్ట్ గేర్ కూడా క‌ష్ట‌మేనట

ప్ర‌స్తుతం మ‌న హీరోయిన్ల ప‌రిస్థితీ అలానే ఉంది. కెరీర్ స్టార్టింగ్‌లో ఫిఫ్త్ గేర్ మీద వెళ్లిన వారు తాజాగా ఫ‌స్ట్ గేర్ కూడా క‌ష్ట‌మే అంటున్నారు. మ‌న మార్కెటింగ్ మేనేజ‌ర్ సుధాక‌ర్ కారు షోరూమ్ నుంచి బ‌య‌ట‌కొచ్చి ఏడాది కాకుండానే షెడ్డుకు వెళ్లిన‌ట్టు హీరోయిన్లు టాలీవుడ్‌లో మూటాముళ్లు స‌ర్దేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా పాయ‌ల్ రాజ్‌పుత్. రెండేళ్ల కింద‌ట సునామీల వ‌చ్చింది ఈ పంజాబీ సుంద‌రి. వ‌చ్చీ రాగానే ఇండ‌స్ట్రీని ఊపేసే హీరోయిన్ లిస్ట్‌లో చేరుతుందేమో అనేంత‌లా త‌న జ‌ర్నీని షురూ చేసింది. కానీ, రెండు క్యాలెండ‌ర్లు తిరిగేస‌రిక‌ల్లా బ్యాక్ ట‌ర్న్ తీసుకుని ఫ‌స్ట్ గేర్ మీద ర‌న్ అవుతోంది. దీంతో పాయల్ బ్యాక్ టు ఫెవిలియ‌న్ అన్న మాట వినిపిస్తోంది.

తెలుగు ఇండ‌స్ట్రీలో పాగా వేసిన పంజాబీ బ్యూటీ పాయ‌ల్ షార్ట్‌పిరియ‌డ్‌లోనే అర‌డ‌జ‌ను సినిమాలు చేసింది. గ్లామ‌ర్ డోస్ మ‌రింత పెంచి న‌టించింది. తెలుగు ఆడియన్స్‌కు ముఖ్యంగా కుర్ర‌కారుకు బాగా క‌నెక్ట్ అయింది. అదే ఊపును కంటిన్యూ చేస్తూ హీరోయిన్ ఒరియంటెడ్ మూవీస్‌ను కూడా ట్రై చేసింది. దీంతో పాయల్‌కు ప్ర‌త్యేక ఫ్యాన్ క్ల‌బ్ ఫామ్ అయింది. దాంతో ఒక్క‌సారిగా పాయ‌ల్ కాల్షీట్‌ల‌కు మాంచి గిరాకీ వ‌చ్చింది.

ఆఖ‌ర‌కు రెగ్యుల‌ర్ హీరోలు కూడా ఆమెను అప్రోచ్ అయ్యారు. విక్ట‌రీ వెంకీమామ‌ స‌ర‌స‌న బాగానే సెట్ట‌యింది. అయితే ఆ చిత్రం స‌క్సెస్ మాత్రం పాయ‌ల్ ఖాతాలో ప‌డ‌లేదు. తాజాగా రిలీజైన డిస్కో రాజా క్రెడిట్ కూడా ద‌క్క‌లేదు. తేజ డైరెక్ష‌న్‌లో సీత సినిమాలో చేసిన ఐటెం నెంబ‌ర్ కూడా సోయ‌లేనే లేకుండా పోయింది. డిస్కో రాజాతో బ్రేక్ వ‌స్తుంద‌న్న ఆశ కూడా అడియాశే కావ‌డంతో చేసేది లేక చ‌లో బాలీవుడ్ అనే నామాన్ని పాయ‌ల్ జ‌పం చేస్తుందంటూ సినీ జ‌నాల నుంచి వినిపిస్తున్న మాట‌. ఏంజెల్ అనే మూవీతో బాలీవుడ్‌లో అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది. టాలీవుడ్‌లో ఫైర్ బ్రాండ్ అనిపించుకున్న ఈ మెరుపుతీగ ఇక తెలుగు సినిమాల్లో క‌నిపించ‌డం క‌ష్ట‌మే మరీ..!

Next Story