పవన్‌ కల్యాణ్‌ సరసన హీరోయిన్‌ ఎవరు..?

By సుభాష్  Published on  11 April 2020 6:08 AM GMT
పవన్‌ కల్యాణ్‌ సరసన హీరోయిన్‌ ఎవరు..?

పవన్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇక రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చి సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మూడు సినిమాలకు ఓకే చెప్పేశాడు. అందులో వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వకీల్‌సాబ్‌, క్రిష్‌ డైరెక్షన్‌లో ఇంకో సినిమా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమా రానుంది. వీటిలో వకీల్‌ సాబ్‌, క్రిష్‌ చిత్రాల షూటింగ్‌ ప్రారంభమైంది. వకీల్‌ సాబ్‌లో పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ నటించబోతుండగా, క్రిష్‌ సినిమాలో పవన్‌ సరసన నటించేది ఎవరనేది అధికారికంగా ప్రకటించలేదు. ఇక హరీష్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమాకు సంబంధించి ప్రొడక్షన్‌ పనులు కొనసాగుతున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా తనకు అందివచ్చిన పూజా హెగ్డేకు హరీష్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కాజల్‌ను తీసుకోవాలని హరీష్‌ శంకర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు సినీ వర్గాల ద్వారా సమాచారం. ఒక వేళ కాజల్‌ను తీసుకోవడం నిజమేతే పవన్‌తో రెండోసారి జతకట్టబోతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. కాగా, చిరంజీవి కొత్త సినిమా అయిన ఆచార్య మూవీలో చిరు సరసన కాజల్‌ రెండోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ పవన్‌ కల్యాణ్‌ సినిమాలో కాజల్‌ నటించడం నిజమేతే.. అన్నయ్య చిరంజీవితోనే కాదు పవన్‌ కల్యాణ్‌తోనే కూడా రెండోసారి జతకట్టనుంది కాజల్‌.

Next Story
Share it