పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదుగా..!!!

By Newsmeter.Network  Published on  21 Nov 2019 1:27 PM GMT
పవన్ కల్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదుగా..!!!

తెలుగు నేలపై మీద ఇంగ్లిష్ మంటలు మండుతున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఏ ముహూర్తానా ఇంగ్లిష్ మీడియం గురించి మాట్లాడారో కాని..అప్పటి నుంచి నిన్ను వదలా అంటూ వెంటపడుతున్నాడు పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగు భాష కమ్మదనం తెలుసా అంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఘాటుగానే ప్రశ్నించాడు. అమ్మలాంటి భాషను కాళ్లదన్నుకుంటారా అని ప్రశ్నించారు. అంతేకాదు..సోషల్ మీడియా వేదికగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై మండిపడుతున్నారు పవన్ కల్యాణ్‌.

మనం ఇంగ్లిష్ భాష కోసం ఆరాటపడుతుంటే.. ఓ ఇంగ్లిష్ వాడు తెలుగు భాషను ఎంత కమ్మగా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ ఓ ట్విట్ చేశారు పవన్‌ కల్యాణ్‌. నిజమే.. ఆ ట్విట్‌లో గతంలోకూడా వైరల్ అయింది. ఇంగ్లండ్‌లోని ఓ క్రికెట్ స్టేడియంలో అతను తెలుగు వాళ్లతో చాలా బాగా తెలుగు మాట్లాడాడు. ఆంధ్రలోని విశాఖపట్నం, విజయవాడలో రెండేళ్లు ఉన్నానని అందుకే తెలుగు మాట్లాడుతున్నానని చెప్పాడు. ఆ ఇంగ్లిష్ మేన్ తెలుగును మీరూ వినండి.



ఇక..మరో ట్విట్ కూడా చేశాడు పవన్ కల్యాణ్‌. మన నుడి..మన నది అంటూ మరో ట్విట్ చేశారు. తెలుగు లేకుండా తెలంగాణ ఉద్యమం ముందుకెళ్లేదా అని ప్రశ్నించాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చేదా అని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్న పాలక వర్గం ఆలోచించాలన్నారు . ఇంకా ట్విటర్‌లో ఏమన్నాడో మీరే చూడండి.

Image

కొన్ని రోజులుగా తెలుగు వర్సెస్ ఇంగ్లిష్ గడ్డపై అలుపులేకుండా కొట్టుకుంటున్నాయి. ఆ కొట్లాటలో అందరూ భాగస్వాములయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవాలంటటే..ఇంగ్లిష్ తప్పనిసరని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి చెబుతున్నారు. ఇంగ్లిష్ నేర్చుకోకపోతే భవిష్యత్తు లేదంటున్నారు. అలా అని తెలుగు భాషను నిర్లక్ష్యం చేయమని కూడా ప్రకటించారు. కాని..ప్రతిపక్షాలు మాత్రం సీఎంపై ఒంటికాలిపైలేస్తున్నాయి. మతం మార్పు కోసమే సీఎం జగన్ ఇంగ్లిష్ ప్రవేశపెడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇక..చంద్రబాబు కూడా తనదైన శైలిలొ బాణాలు వదులుతున్నారు. కాని..మంత్రులు మాత్రం ఇంగ్లిష్ తో నే భవిష్యత్తు అని కుండబద్దలు కొట్టారు.

మొత్తానికి ఇటాలియన్‌ ఆఫ్ ది ఈస్ట్, దేశ భాషలందూ తెలుగు లెస్సా అనే మాటలు ఇప్పుడు ఎవరికి అవసరం అన్నట్లు ఉన్నాయి. ఇంగ్లిష్‌ నేర్చుకుంటే తెలుగు భాషను మర్చిపోతామా అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. సీఎం సాక్షిగా ఓ విద్యార్ధిని లోకేష్, పవన్ కల్యాణ్‌లకు సూటిగా ఓ ప్రశ్నించింది. మేం ఇంగ్లిష్ చదువు కోవడం మీకు ఇష్టంలేదా అని ప్రశ్నించింది. మీ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి తెలుగు , ఇంగ్లిష్ యుద్ధానికి ఆంధ్ర నేల వేదిక అయింది. ఇంగ్లిష్ వాడు పాలిస్తున్నప్పుడు మనోళ్లు ఆ భాష వద్దని ఎదరించారో లేదో కాని..ఇప్పుడు మాత్రం అన్ని తెలిసిన పెద్దోళ్లే చెలరేగిపోతున్నారు. ఎవరేమీ అనుకున్నా ఒకటి మాత్రం వాస్తవం..ఇంగ్లిష్ రాకపోతే అవకాశాలు అందిపుచ్చుకోలేరు. ఎంత సబ్జక్ట్ ఉన్నా ఇంగ్లష్ కూడా ఉండాలి. ఇది సత్యం.

Next Story