పవన్ కళ్యాణ్‌కి 'పింక్' మరో డిజాస్టరా ?

By అంజి  Published on  16 Feb 2020 2:15 PM GMT
పవన్ కళ్యాణ్‌కి  పింక్ మరో డిజాస్టరా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో చేస్తున్న 'పింక్' తెలుగు రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పింక్ రీమేక్ తో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తాడని పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసుకుంటూ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. దాంతో ఈ సినిమా పై భారీ అంచానాలు పెట్టుకున్నట్టు అయింది. పింక్ సబ్జెక్టు పక్కా కమర్షియల్ అంశాలకు దూరంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాపై అంచనాలు మరి ఎక్కువ అయితే.. చివరికీ పవన్ ఫ్యాన్సే నిరాశ పడే అవకాశం ఉంది. అజ్ఞాతవాసికి కూడా ఇలాగే జరిగింది.

అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే అనేక పేర్లు సోషల్ మీడియాలో హల్ చల్చేశాయి. అయితే 'వకీల్ సాబ్' అనే టైటిల్ ను ఫిల్మ్ ఛాంబర్ లో చిత్రబృందం రిజిస్టర్ చేయించిందట. దాదాపు ఈ సినిమాకు 'వకీల్ సాబ్' టైటిలే ఫిక్స్ అయ్యేలా ఉంది. ఇదే టైటిల్ ను ఉగాది రోజున రివీల్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని మే 15న విడుదల చేయాలని నిర్మాత దిల్ రాజు డిసైడ్ అయ్యారు. ఈ తేదీ వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. అదే 'గబ్బర్ సింగ్'. ఈ చిత్రాన్ని అంతా పవన్ కమ్ బ్యాక్ మూవీ అంటుంటారు. ఇది మే 11న విడుదలై ఇండస్ట్రీ హిట్ అయింది. అందుకే దిల్ రాజు పవన్ రీఎంట్రీ చిత్రాన్ని కూడా అదే నెలలో విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనతో మే 15ను విడుదల తేదీగా నిర్ణయించారట.

ఇకపోతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను చేస్తిన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హరీష శంకర్ దర్శకత్వంలో కూడా ఇంకో కొత్త సినిమాకుచేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story