హైదరాబాద్ : విజయవాడలో రాజకీయాలు అయిపోయాయి. జనసేనాని ఫామ్ హౌజ్ చేరుకున్నాడు. నేరుగా ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయాడు. అక్కడ పంచ కట్టి కలియతిరిగాడు. ఆవులకు అరటి పండ్లు పెడుతూ ఆహ్లాదకరంగా గడిపాడు. కొన్ని మొక్కలు నాటాడు. వన రక్షక్ ప్రోగ్రాం, కార్తీక మాస వ్రతం తన ఫామ్ హౌజ్ లో జనసేనాని చేసుకున్నారు. అడవులను, చెట్లను కాపాడుకోవాలని పురాణాలు, వేదాల్లో చెప్పారంటూ పవన్ ట్వీట్ చేశారు.