వివాదాల వెబ్ సిరీస్.. అనుష్కకు కూడా తిట్లు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 8:01 AM GMT
వివాదాల వెబ్ సిరీస్.. అనుష్కకు కూడా తిట్లు..!

పాతాళ లోక్.. ఈ వెబ్ సిరీస్ ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. అనుష్క శర్మ కూడా ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించింది. ఈ వెబ్ సిరీస్ విడుదలైనప్పటి నుండి ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. నేపాలీల మనోభావాలు దెబ్బ తినేలా వ్యాఖ్యలు ఉన్నాయంటూ కొద్దిరోజుల కిందట తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది చిత్ర బృందం.



తాజాగా మరో వివాదం ఈ వెబ్ సిరీస్ ను చుట్టుముట్టింది. సిక్కుల సెంటిమెంట్లకు వ్యతిరేకంగా ఈ వెబ్ సిరీస్ లో కొన్ని సన్నివేశాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంజాబ్&హర్యానా కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న జి.హెచ్.డిల్లాన్ అనే అడ్వొకేట్ పాతాళలోక్ వెబ్ సిరీస్ లో సిక్కుల మనోభావాలు దెబ్బ తినేలా సన్నివేశాలు ఉన్నాయని.. ఎస్.ఏ.ఎస్. నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 'A History of Violence' అనే మూడో ఎపిసోడ్ లో మతాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని కోర్టుకు తెలిపారు. వెబ్ సిరీస్ లో కావాలనే క్యాస్ట్ గురించి ప్రస్తావించారని ఆయన ఆరోపించారు. పంజాబ్ లోని గ్రామానికి సంబంధించిన సన్నివేశంలో రెండు గ్రూప్ ల మధ్య జరిగిన గొడవల్లో కావాలనే కులాలను తీసుకుని వచ్చారని ఆరోపించారు. ముఖ్యంగా ఏయే సీన్ల ద్వారా అభ్యంతరాలు ఉన్నాయో కూడా డిల్లాన్ తన కంప్లైంట్ లో రాశారు.

దర్శకుడు, నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఎఫ్.ఐ.ఆర్.లో కోరారు. Indian Penal Code, Scheduled Caste and Scheduled Tribe (Prevention Of Atrocities) Act, 1989 and Information And Technology Act కింద చర్యలు తీసుకోవాలని కోరారు. అనుష్క శర్మ కూడా చిత్ర నిర్మాతల్లో ఒకరు కావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story