వాహనాల రాకపోకలతో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. అక్కడున్న ప్రజలంతా చూస్తుండగానే రోడ్డు పై భాగం లోపలికి వెళ్లిపోయింది. అదృష్టవశాత్తు రోడ్డు కుంగిపోతున్న సమయంలో అక్కడ వాహనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలో చోటు చేసుకుంది.