హైదరాబాద్‌: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీపాద శ్రీ వల్లభ క్షేత్రం, కుక్కుటేశ్వరస్వామి ఆలయం, కుంతీ మాధవ స్వామి ఆలయం.. ఇలా అనేక దేవాలయాల్లో కుట్ర పూరిత దాడులు జరుగుతున్నాయని స్వామి పరిపూర్ణానంద అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక సమావేశంలో ఆయన మాట్లాడారు. పిఠాపురంలో పెద్ద కుట్ర జరిగిందని పరిపుర్ణానంద ఆరోపించారు. దేశ భవిష్యత్తుపై బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కలలకు తూట్లు పొడిచెలా ఈ చర్యలు ఉన్నాయన్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

23 ప్రాంతాల్లో విగ్రహాల ధ్వంసం ఒక్కడి వల్ల కాదని.. మరికొంత మంది ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారన్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా అందిపుచ్చుకున్న అధికారులు మాత్రం స్పందించడం లేదన్నారు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తిని తీసుకువచ్చి ఇతనే విగ్రహాలను ధ్వంసం చేశాడని చెప్తున్నారని అన్నారు. హైందవ సంఘాల ఐక్య పోరాట వేదిక ద్వారా పోరాడుదామని నిర్ణయం తీసుకున్నామని పరిపూర్ణానంద తెలిపారు. కేవలం గుడి లోపం ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారని.. ప్రభుత్వాధికారులు చేసే విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. ధ్వంసం అయిన విగ్రహాలు హిందు ధర్మం ప్రకారం విసర్జన చేసి.. కొత విగ్రహాలు ప్రతిష్టాంచాలన్నారు. ధ్వంసం చేసిన వారి ఆస్తులు జప్తు చేసి విగ్రహాల పునరుద్ధరణ జరపాలని పరిపుర్ణానంద డిమాండ్‌ చేశారు.

గడప గడపకు హిందూత్వం అనే నినాదంతో ధర్మ జాగరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. మార్చ్‌ 1 నుంచి దూడల్‌ సంత, గొల్లప్రోలు రోడ్డు, పిఠాపురంలో సహస్ర కళాశాభిషేకం చేస్తామన్నారు.

విగ్రహాల ధ్వంసం ఒక కుట్రగా భావించి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు. వందల సంవత్సరాలు పోరాడితే కానీ రామమందిర నిర్మాణానికి న్యాయం జరగలేదన్నారు. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వాన్ని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.