బొప్పాయి గురించి తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు

By సుభాష్  Published on  3 Aug 2020 4:21 PM IST
బొప్పాయి గురించి తెలిస్తే మీరు తినకుండా ఉండలేరు

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య ఎక్కువైపోతుంది. కొన్ని కొన్ని పండ్లను తింటుంటే అనారోగ్యం బారిన పడకుండా ఆస్పత్రికి వెళ్లే బాధ నుంచి తప్పించుకోవచ్చు. ఇక బొప్పాయి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. బొప్పాయి ఆకుల రసం తాగితే కూడా ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. డెంగ్యూ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. బొప్పాయిలో విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. కరోనా వైరస్‌ రాకుండా వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేందుకు ఈ బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు వైద్య నిపుణులు. ఇవే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది కూడా.

బొప్పాయిలో విటమిన్‌-సి, యాంటీఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. భోజనం తర్వాత బొప్పాయిని తింటే ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది. పొట్ట, పేగుల్లో విషపదార్థాలను తొలగిస్తుంది.

బొప్పాయిలోని ప్లేవనాయిడ్స్‌, పోటాషియం, మినరల్స్‌, కాపర్‌, మెగ్నిషియం, ఫైబర్‌ వంటి పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. డెంగీ ఫీవర్‌తో బాధపడేవారికి ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అలాంటి వారు తప్పనిసరిగా బొప్పాయి తినాల్సిందే. ఫలితంగా ఫ్లేట్‌ లెట్స్‌ మళ్లీ వేగవంతంగా పెంచేలా చేస్తుంది బొప్పాయి.

శరీరంలో చెడు కొవ్వును తరిమేస్తుంది..

బొప్పాయి ఆకుల రసం తాగినా మంచి ఫలితం ఉంటుంది. బొప్పాయిలో క్యాలరీలు తక్కువే. అందు వల్ల ఎక్కువగా తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. పైగా ఇది చెడు కొవ్వును తరిమేస్తుంది. గుండెకు రక్తం చక్కగా సరఫరా అయ్యేలా ఉపయోగపడుతుంది. అంతేకాదు మూత్రపిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. బొప్పాయి రెగ్యులర్‌గా తింటే మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అరికడుతుంది. మూత్ర పిండాల్లో రాళ్లు ఉండేవారికి బొప్పాయి సరైన మందు. రోజువారిగా తింటే మూత్రపిండాల్లో ఉన్న రాళ్లు కరిగిపోతాయని వైద్యులు చెబుతున్న మాట. అలాగే అలసట, నీరసం వంటి అనారోగ్య సమస్యలను బొప్పాయి తొలగిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి బలం వస్తుంది.

అంతేకాదు ఈ బొప్పాయిలో క్యాన్సర్‌పై పోరాడే గుణాలున్నాయి. ఇందులో బీటాకెరోటిన్‌, లూటిన్‌ వంటి యాంటి ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ వైరస్‌తో పోరాడే గుణం ఉంది. ఇది కొలన్‌, గర్భాశయ క్యాన్సర్‌లను తగ్గిస్తుంది. ఇక బొప్పాయిని అప్పుడప్పుడు తీసుకుంటే కళ్లు చల్లగా ఆరోగ్యంగా ఉంటాయి.

బీపీ, షుగర్‌ ఉన్నవారికి..

ఇక బీపీ, షుగర్‌ ఉన్నవాళ్లు కూడా బొప్పాయి తింటే ఎంతో మంచిది. నారింజ, యాపిల్‌ కంటే బొప్పాయిలో విటమిన్‌ -ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. అందు వల్ల చర్మం సున్నితంగా, మృదువుగా మారడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది.

ప్రెగ్నెన్సీ ఉన్నవారు తినకూడదు ..

బొప్పాయిని ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్లు తినకూడదు. ఎందుకంటే బొప్పాయిలో విపరీతంగా వేడి చేసే గుణం ఉంటుంది. అందువల్ల గర్భిణీ మహిళలు బొప్పాయి ఎక్కువగా తింటే ప్రమాదమేనంటున్నారు వైద్యులు.

Next Story