పసుపుతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చా..!

By సుభాష్  Published on  18 July 2020 3:09 AM GMT
పసుపుతో కరోనా నుంచి రక్షణ పొందవచ్చా..!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనాకు వ్యాక్సిన్‌ లేని కారణంగా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే మేలు. అయితే కరోనా నుంచి రక్షించుకోవడానికి రోగనిరోధక శక్తి తప్పనిసరిగా అవసరం. కొన్నికొన్నింటి ఎక్కువగా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. అయితే భారతీయ సంస్కృతిలో మంగళకరంగా భావించి వాటిలో పసుపు అత్యంత ప్రధానమైనది. దీనిని ఆహారంలో రంగు, రుచి కొరకు వాడటంతో పాటు పసుపులో ఎన్నో ఔషధ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. పసుపును గడపకు ప్రతి రోజు పెట్టినట్లయితే ఇంట్లోకి క్రిమికీటకాలు లాంటివి రాకుండా ఉంటాయనేది నమ్మకం. ఇక పసుపుతో కరోనా నుంచి రక్షించుకోవచ్చని ఎందరో చెబుతున్నమాట. అయితే పసుపు ఎన్నో సమస్యలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

♦ గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపు పొడిగి, కొద్దిగా మిరియాల పొడి కలిపి ఆ మిశ్రమాన్ని వేడి చేసి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు తాగినట్లయితే జలుబు, తుమ్ములు, దగ్గు వంటివి నివారించవచ్చు.

♦ పసుపు, ఊసిరి ఊర్ణం ఈ రెండింటిని రెండు గ్రాముల చొప్పున ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమోహం అందుపులో ఉంటుంది.

♦ ముక్కలుగా చేసిన పసుపు కొమ్ములు, గోధుమలు సమంగా తీసుకుని దోరగా వేచించి చూర్ణం చేసుకుని ప్రతి రోజు మూడు పూటలు ఆహారం తీసుకునే అరగంట ముందు పావు స్పూను పొడిని అర గ్లాసు గొరువెచ్చని నీటిలో కలిపి తాగినట్లయితే ఉబ్బసం వ్యాధి అదుపులో ఉంటుంది. అలాగే వ్యాధి తీవ్రత తగ్గడం, తుమ్ములు, జలుబు నివారించవచ్చు.

♦ అలాగే పసుపులో ఉండే కుర్కుమిన్‌ హర్మోన్లను క్రమపద్దతిలో ఉంచి, మతిమరుపును కూడా నివారిస్తుందటున్నారు. పసుపులో యాంటీ ఆక్సిండెంట్‌ గుణాలు గుండెకు సంబంధించిన వ్యాధులను రానివ్వకుండా ఉపయోగపడుతుంది. అంతేకాదు మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. క్యాన్సర్‌కు సంబంధించిన ట్యూమర్ల పెరుగుదల, కణాల విస్తరణను పసుపు అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. క్యాన్సర్‌తో పోరాడే గుణాలు పసుపులో చాలా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

♦ అలాగే అమెరికాకు చెందిన ఎండీ అండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో పసుపు ఔషద గుణాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. పసుపు తాత్కాలిక ఆరోగ్య సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఇలా చేయడం వల్ల నిరో నిరోధక శక్తి పెరగడమే కాకుండా కరోనా నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Next Story