కరోనా వైరస్ వ్యాప్తకి 'అలుగు'లే కారణమట.. ఎందుకో తెలుసా.!
By అంజి
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వైరస్ కరోనా. చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచ దేశాలనూ వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ఏ జంతువుల ద్వారా వ్యాప్తి చెందినది అనేది మాత్రం శాస్త్రవేత్తలు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. మొదటగా కరోనా వైరస్.. పాముల ద్వారా మనుషులకు వ్యాపించి ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో కొత్త విషయాన్ని చెబుతున్నారు. కొందరు శాస్త్రవేత్తలు.. ఈ వైరస్ వ్యాప్తికి గబ్బిలాలే కారణమని అంటున్నారు. తాజాగా అలుగు (పాంగొలిన్)ల వల్లనే కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉంటుందని దక్షిణా చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు. అలుగు జన్యుక్రమం.. కరోనా వైరస్ బాధితుల నమునాలతో 99 శాతం సరిపోలుతోందని అధ్యయనంలో వెల్లడైంది. చైనాతో కొన్ని దేశాల ప్రజలు అలుగు మాంసాలను తింటారు.
చైనాలో కరోనా వైరస్ కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యుఓడికి చేరుతున్నారు. ఇప్పటివరకు 34,872 మందికి కరోనా వైరస్ సోకినట్లు చైనా అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఒక్క రోజే 88 మంది చనిపోయారు. అందలో 69 మంది హుబెయ్ ప్రావిన్స్‌కు చెందిన వారు కావడం గమన్హారం. కరోనా వైరస్ మృతుల సంఖ్య 724కి చేరింది. బ్రిటన్ దేశాల్ల కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 31కి చేరింది. 1,568 మంది కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారు. చైనాలో కరోనా వైరస్ వ్యాపి కారణంగా.. అక్కడి ప్రభుత్వ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
కరోనా వైరస్‌పై వ్యాప్తిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మాట్లాడారు. సమస్యపై సహేతుకంగా ఆలోచించాలని ఆయన వినతి చేశారు. పరిస్థితిపై తాము చేస్తున్న ప్రయత్నాలను గమనించాలన్నారు.