డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో పై పంచుమర్తి కౌంటర్

By రాణి  Published on  2 Jan 2020 1:59 PM IST
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి టిక్ టాక్ వీడియో పై పంచుమర్తి కౌంటర్

ముఖ్యాంశాలు

  • రాష్ర్టాన్ని పరిపాలించడమంటే..టిక్ టాక్ చేసినంత ఈజీ కాదు

రాష్ర్టాన్ని పరిపాలించడమంటే టిక్ టాక్ వీడియోలు చేసినంత ఈజీ కాదని టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కౌంటర్ ఇచ్చారు. ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు వస్తే అందుబాటులోకి రాని శ్రీవాణికి టిక్ టాక్ వీడియోలు చేసేంత ఖాళీ ఉంటుందా ? అని ప్రశ్నించారు. రాజధాని ప్రాంత రైతులు రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తుంటే..వైసీపీ నాయకులకు చీమకుట్టినట్లైనా లేదని విమర్శించారు. రైతుల దుస్థితిని చూసి చలించిపోయిన భువనేశ్వరి తన చేతి గాజులిస్తే..ఆమెపై ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేయడం తగదని హెచ్చరించారు.

https://telugu.newsmeter.in/deputy-cm-tiktok-video-praising-jagan/

డిసెంబర్ 31, 2019న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి చేసిన టిక్ టాక్ వీడియో విపరీతంగా వైరల్ అయింది. రాయలసీమ ముద్దుబిడ్డ మన జగనన్న అనే పాటకు పుష్ప శ్రీవాణి అనుకరిస్తూ వీడియో చేశారు. రెండ్రోజులుగా ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం ఇది జగన్ ఫ్యాన్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తోంది.

Also Read

Next Story