జలంధర్ లో ఇళ్ల పైన పాకిస్తాని జెండాలు ఎగురవేసారా??

By సత్య ప్రియ  Published on  9 Nov 2019 2:32 PM IST
జలంధర్ లో ఇళ్ల పైన పాకిస్తాని జెండాలు ఎగురవేసారా??

జలంధర్ నగరంలో ఇంటి మీద పాకిస్తాన్ జెండాలు ఎగురవేసారంటూ ఒక వీడియో సోషల్ మీడీయాలో తిరుగుతోంది. ముఖ్యంగా, ఫేస్ బుక్, ట్విట్టర్ లలో షేర్ చేయబడుతోంది. కర్తార్ పూర్ లో గురుద్వారా నిర్మించినందుకు గాను పాకిస్తాన్ ప్రభుత్వానికి మద్దత్తుగా సిక్కు వర్గంవారు ఈ జెండాలు ఎగురవేసారు అంటూ ఈ వీడియో ట్విట్టర్ లో షేర్ చేయబడింది.



కొన్ని ఫేస్ బుక్ ఖాతాలలో కూడా ఈ వీడియోను షేర్ చేయబడింది.

నిజ నిర్ధారణ: జలంధర్ లో పాకిస్తాన్ జెండాలు అనే పదాలను ఉపయోగించి కీవర్డ్ సెర్చ్ చేసి చూసినప్పుడు, పంజాబ్ కేసరి అనే పత్రికా వెబ్ సైట్ లో ప్రచురించిన ఒక కధనం కనుగొనింది న్యూస్ మీటర్ బృందం.

ఆ కధనం లో జలంధర్ లో ఇంటి పైన ఎగురవేసినవి పాకిస్తాని జెండాలు కావని, ఇస్లాం మతానికి చెందిన జెండాలని, జలంధర్లోని విజయ్ కాలని వాసుల మధ్య గొడవ జరగగా పోలీసులు జెండాలను పీకి వేసారనీ రాసి ఉంది.

https://punjab.punjabkesari.in/punjab/news/pakistani-like-flags-seen-house-police-removed-1077477

నవంబర్ 10 న, మిలాద్-ఉన్-నబి రానుంది. ఈ సందర్భంగా, జెండాలు ఇళ్లపైన ఎగురవేసారని తెలుస్తోంది. ఇలాంటి జెండాలనే ప్రతి సంవత్సరం జరిగే మిలాద్-ఉన్-నబి ఊరేగింపులో కనపడతాయి.

డిసెంబర్ 2016లో హిందుస్తాన్ టైంస్ లో ప్రచురించిన కధనంలో ఇటువంటి జెండాలనే చూడవచ్చు.

https://www.hindustantimes.com/india-news/supreme-court-seeks-government-response-on-plea-to-ban-un-islamic-flags/story-HosiwoJd9Bz8jQRPTdDhPN.html

డిసెంబర్ 2017 లో థి హిందూ లో ప్రచురించిన కధనం లో మిలాద్-ఉన్-నది ఊరేగింపు చిత్రాలలో కూడా వీడియోలో ఉన్న మొరో రకమైన జెండాను చూడవచ్చు.

https://www.thehindu.com/news/cities/Hyderabad/city-comes-alive-on-milad-un-nabi/article21251123.ece

జలంధర్ ఇంటి పైన ఎగురవేసిన జెండాలు పాకిస్తాని జెండాలనే ప్రచారంలో నిజం లేదు. కేవలం మిలాద్-ఉన్-నబి సందర్భంగా ఎగురవేసినవని తెలుస్తోంది.

ప్రచారం: జలంధర్ లో ఇళ్ల పైన పాకిస్తాని జెండాలు ఎగురవేసారు.

ప్రచారం చేసినది: ట్విట్టర్, ఫేస్ బుక్ లో.

నిజ నిర్ధారణ: అబద్దం. అవి కేవలం మిలాద్-ఉన్-నబి సందర్భంగా ఎగురవేసిన ఇస్లామి జెండాలు తప్ప పాకిస్తాని జెండాలు కావు.

Next Story