క్రికెట్‌కు ఉమర్‌గుల్ ఆల్విదా
By సుభాష్ Published on 17 Oct 2020 11:03 AM ISTపాకిస్థాన్ జట్టుకు రెండు దశాబ్దాల పాటు ఎనలేని సేవలందించిన పేస్ బౌలర్ ఉమర్ గుల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 36 ఏళ్ల గుల్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. పాకిస్థాన్ నేషనల్ టీ20 కప్‌లో గుల్ బలూచిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న గుల్.. సౌతర్న్ పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
'నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. నా క్రికెట్ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. కృషి, సంకల్పం, నిబద్ధత, గౌరవ విలువలను నేను క్రికెట్ నుంచే నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్రయాణంలో మద్దతు ఇచ్చిన, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్లు నాకోసం ఎంతో త్యాగం చేశారు. ఇక నుంచి నేను వాళ్లను మిస్ అవుతాను' అని గుల్ ఉద్వేగానికి గురయ్యారు.
2002 అండర్ 19 వరల్డ్‌కప్‌లో మెరిసిన ఉమర్ గుల్.. 2003లో జింబాంబ్వే పై మ్యాచ్‌తో వన్డేల్లో అరంగ్రేటం చేశాడు. అదే ఏడాది బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2016లో పాకిస్థాన్ తరఫున గుల్ చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. పాకిస్థాన్ తరఫున మొత్తం 47 టెస్టు మ్యాచ్‌లాడిన గుల్ 163 వికెట్లు తీశారు. 130 వన్డేల్లో 179 వికెట్లు, 60 టీ20 మ్యాచుల్లో 85 వికెట్లు పడగొట్టారు. ఇక ఐపీఎల్ 2008 సీజన్‌లోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.