అభినందన్‌పై మరోసారి తన వక్ర బుద్ధిని చూపిన పాక్‌..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Nov 2019 10:15 AM GMT
అభినందన్‌పై మరోసారి తన వక్ర బుద్ధిని చూపిన పాక్‌..

నిత్యం భారత్‌పై దుష్ప్రచారం చేసే పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. కరాచీలోని పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మ్యూజియంలో.. భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌ జర్నలిస్ట్ అన్వర్‌ లోధి తన ట్విటర్‌లో ఈ చిత్నాన్ని పోస్ట్‌ చేశారు.

అయితే ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న అభినందన్ పాక్ సైన్యానికి పట్టుబడిన సంగతి తెలిసిందే. మిగ్-21 విమానాన్ని నడుపుకుంటూ, పొరపాటున పాక్ గగనతలంలోకి ప్రవేశించగా, దాన్ని కూల్చివేసిన పాక్ దళాలు, అభినందన్‌ను బంధీగా పట్టుకున్నాయి. ఆ వెంటనే అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చిన ఒత్తిడితో, మార్చి 1న వాఘా సరిహద్దు వద్ద అతన్ని విడిచిపెట్టారు.

అయితే అభినందన్‌ను పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోని దృశ్యాన్ని బొమ్మగా మలిచి మ్యూజియంలో ఉంచారు. పాక్ మ్యూజియంలో అభినందన్ విగ్రహం పెట్టారని, అతడి చేతిలో ఒక 'ఫెంటాస్టిక్' టీ కప్పు కూడా ఉంటే బాగుండేదని..లోధి తన ట్విట్టర్ ఖాతాలో అన్వర్‌ లోధి వ్యంగ్యంగా పోస్ట్‌ చేశారు.Next Story