కర్తార్ పూర్ గురుద్వారా పైన పాకిస్తాని జెండా... అంటూ తప్పుడు ప్రచారం

By సత్య ప్రియ  Published on  6 Nov 2019 1:31 PM IST
కర్తార్ పూర్ గురుద్వారా పైన పాకిస్తాని జెండా... అంటూ తప్పుడు ప్రచారం

కర్తార్ పుర్ గురుద్వారా, భారత దేశ సిక్కుల పవిత్ర స్థలం. సిక్కు మత స్థాపకుడు, గురునానక్ చాలా సంవత్సరాలు ఇక్కడ జీవించారు. 1539 లో ఆయన ఈ స్థలం లోనే మరణించారు. ఆయన మరణానంతరం, ఆ ప్రాంతంలో గురుద్వారాని నిర్మించారు.

కర్తార్ పుర్, భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు 3 కిమి ల దూరంలో ఉంది. ఇరు దేశాల మధ్య ఎన్నో చర్చల తరువాత, పాకిస్తాన్ కర్తార్ పుర్ ప్రాజెక్ట్ శంకుస్థాపన నవంబర్ 28, 2018 న చేసింది. మొదటి విడత నిర్మాణం పనులు పూర్తవ్వడంతో, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కారిడార్ ని నవంబర్ 9, 2019 న ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా, ట్విట్టర్ లో కొన్ని చిత్రాలు షేర్ చేయబడ్డాయి. వాటిలో ఉన్నది కర్తార్ పూర్ గురుద్వారా అంటూ, దాని పై కప్పు పై పాకిస్తాన్ జెండా ఉంది అంటూ ఆ ట్వీట్ లో ఉంది.

"సిక్కుల జెండా కి బదులు పాకిస్తాని జెండా ఎగురవేస్తున్నారు. ఇదెనా ఖలిస్తాన్ అంటే... అందరూ పిరికిపందలుగా మారిపోయారా? ఇస్లాం కు మారుతున్నారా??" అంటూ రెచ్చగొట్టేదిగా ఉంది ఆ ట్వీట్.

Pic 1

నిజ నిర్ధారణ: ఈ చిత్రాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా తెలిసింది ఏమిటంటే, ఈ చిత్రాలు కర్తార్ పూర్ కారిడార్ కి చెందినవే అయినా, గురుద్వారా చిత్రాలు కావు. ఇవి అక్కడ పాకిస్తాని ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన ఇమిగ్రేషన్ సెంటర్ వి. పాకిస్తాన్ లోకి ప్రవేశించడానికి ముందు యాత్రికుల తనిఖీ వంటి పనులు ఈ భవనంలో జరుగుతాయి.

ట్రిబ్యూన్ ప్రచురించిన కధనం:

https://tribune.com.pk/story/2092868/1-first-phase-kartarpur-corridor-project-completed/

ప్రారంభోత్సవానికి ముందు, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురుద్వారా చిత్రాలను ట్విట్టర్ లో షేర్ చేశారు.



అలాగే, కర్తార్ పూర్ గురుద్వారా చిత్రాలను ప్రచురించిన మరిన్ని కధనాలు:

https://www.thehindu.com/news/national/2200-indian-sikhs-reach-pakistan-for-kartarpur-corridor-opening/article29894938.ece

https://www.indiatoday.in/india/story/kartarpur-corridor-2-200-indian-sikhs-reach-nankana-sahib-pakistan-1615970-2019-11-05

ట్విట్టర్ లో ప్రచారం చేసిన విధంగా గురుద్వారా పైకప్పు పైన పాకిస్తాని జెండా ఎగురవేయలేదు.

ప్రచారం: కర్తార్ పూర్ గురుద్వారా పైకప్పు పైన పాకిస్తాన్ జెండా

ప్రచారం చేసింది: ట్విట్టర్ లో

నిజ నిర్ధారణ: ఈ చిత్రంలో ఉన్న భవనం కర్తార్ పూర్ గురుద్వారా కాదు, అదే ప్రదేశంలోని భారత్ పాకిస్తాన్ వద్ద యాత్రికుల వసతి కోసం ఏర్పాటు చేసిన ఇమిగ్రషన్ సెంటర్ ది.

Next Story