అక్కడ కూడా పాక్‌కు చెక్‌..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2019 1:02 PM GMT
అక్కడ కూడా పాక్‌కు చెక్‌..!!

బ్రస్సెల్స్‌(బెల్జియం): కశ్మీర్ విషయంలో భారత్‌కు ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని మద్దతు లబిస్తోంది. తాజాగా ఐరోపా సమాఖ్య కూడా కశ్మీర్‌ విషయంలో భారత్‌కు మద్దతుగా నిలిచింది."ఉగ్రవాదులు చంద్ర మండలం నుంచి రావడంలేదు..పక్కన ఉన్న పాక్‌ నుంచే వస్తున్నారంటూ"ఐరోపా సమాఖ్య అభిప్రాయపడింది. దాదాపు 12 తరువాత ఈయూలో కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చింది. పాక్‌ లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న అక్కడ పాలకులు మాట్లాడరని..కశ్యీర్ లో ఏదో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారని పాక్‌ను యూరప్‌ ప్రతినిధులు దెప్పిపొడిచారు.

యూరప్‌లో ఉగ్రదాడులు కూడా పాక్‌ ఉగ్రవాదుల ప్రోత్సాహంతో నే జరుగుతున్నాయని ఈయూ అభిప్రాయపడింది. ఇప్పటికైనా పాక్‌ మంచి ఆలోచనలతో ముందుకు నడవాలని..కశ్మీర్‌ అంశాన్ని చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలని ఈయూ ఓ తీర్మానం చేసింది. ఆర్టికల్ 370 రద్దు తరువాతప్రపంచ దేశాల ముందు ఓవరాక్షన్‌కు పోయి పాక్‌ భంగపడుతున్న సంగతి తెలిసిందే.

Next Story