ముంబై:మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతుంది. మరోవైపు సీఎం ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ కాలం పూర్తి కానుంది. అయితే..ఇప్పటి వరకు ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ- శివసేన ముందుకు రాలేదు. కాంగ్రెస్‌, ఎన్‌సీపీ కూడా తన మనసులో ఏముందో చెప్పడం లేదు. శివసేన మాత్రం మెట్టు దిగి రావడంలేదు. అవసరమైతే ప్రతిపక్షంలో కూర్చుంటామని బీజేపీ శివసేనను హెచ్చరించింది.

Image అయితే…తనయుడు ఆధిత్యను సీఎంగా చూసుకోవాలని కలలు కంటున్న ఉద్దవ్..సంకీర్ణ సిద్ధాంతాలకు మంగళం పాడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శివసేనలో ఇంటర్నల్‌గా ఉద్దవ్ నిర్ణయాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. రాజకీయ ప్రతిష్టంభనకు స్వస్తి పలకాలని కొంతమంది శివసేన ఎమ్మెల్యేలు అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. శివసేన తన ఎమ్మెల్యేలు జారీ పోకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. శివసేన ఎమ్మెల్యేలను టచ్‌ కూడా చేయమని బీజేపీ చెబుతుంది. అయితే…గవర్నర్ కోషీయారికి ఫడ్నవీస్ రాజీనామా లేఖ ఇచ్చారు. సో..రేపటితో మహారాష్ట్ర అసెంబ్లీ కాలం ముగుస్తుండటంతో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనను అపద్ధర్మ సీఎగా కొనసాగమని గవర్నర్ కోరే అవకాశముంది. ఇక…రాబోయే రాజకీయాలను బట్టి మహారాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చు.

 

Image

ముంబైలో పొలిటికల్ హై టెన్షన్  కొనసాగుతోంది.  ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేశారు. లేదులేదు అంటేనే శివసేన ఎమ్మెల్యేలను కాపాడుకునే  ప్రయత్నం చేస్తుంది. బస్సుల్లో ఫైవ్  స్టార్ హెటళ్లకు తన ఎమ్మెల్యేలను తరలిస్తుంది.   ఇండియా టుడే చేసిన ట్విట్ లో హోటల్ లో శివసేన ఎమ్మెల్యేలను చూడొచ్చు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.