ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్.. ఊపిరి ఆడక వ్యక్తి మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 1 Sept 2020 7:16 AM ISTజోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గద్వాల ప్రభుత్వాసుపత్రిలోని ఆక్సిజన్ సిలిండర్ లీకైంది. ఒక్క సారిగా భారీ శబ్ధం రావడంతో.. ఏం జరిగిందో తెలియక రోగులు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ఆత్మకూరు గ్రామానికి చెందిన కృష్ణయ్య ఆక్సిజన్ అందక వెంటిలేటర్‌పై ఉన్న కృష్ణయ్య అనే వ్యక్తి మృతి చెందాడు. నిన్ననే ఆయాసంతో అతను ఆస్పత్రి చేరాడు. అతడికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు
ప్రమాదం జరిగిందనే వార్త తెలియడంతో సంఘటన స్థలానికి అగ్నిప్రమాపక వాహనం రావడం.. ఎలాంటి మంటలు లేకపోవడంతో వెనుతిరిగడం జరిగింది. ఆసుపత్రిలో ఉండే రోగులు సమాచారం మేరకు ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు శబ్దం రావడం పొగలు కమ్ముకోవడంతో పరుగులు తీసినట్లు తెలిపారు.
Next Story