కోహ్లీ సూపర్.. జాంటీ రోడ్స్ తరహాలో
By Newsmeter.Network Published on 5 Feb 2020 2:32 PM ISTభారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఫీల్డింగ్ లో అదరగొట్టాడు. జాంటీ రోడ్స్ తరహాలో హెన్రీ నికోలస్‌ని రనౌట్ చేశాడు. హామిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ లో జరుగుతున్న తొలి వన్డేలో కివీస్ ముందు టీమిండయా 348 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చేధనలో న్యూజిలాండ్ జట్టు ధాటిగా ఆడుతోంది. ఆజట్టు ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (32; 41బంతుల్లో 2 పోర్లు), హెన్రీ నికోల్స్ (78; 82 బంతుల్లో 11 ఫోర్లు) తొలి వికెట్ కు 85 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించారు. 32 పరుగులు చేసిన గుప్టిల్ ను శార్థుల్ ఠాకూర్ పెవియన్ కు పంపాడు.
వన్ డౌన్ లో వచ్చిన టామ్ బ్లుండెల్ (9; 10బంతుల్లో 1 పోర్) ను కుల్దీప్ ఔట్ చేశాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన హెన్నీ నికోల్స్ కు సినీయర్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ జత కలిసాడు. వీరిద్దరు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. దీంతో కివీస్ లక్ష్యాన్ని సునాయాసనంగా చేజింగ్ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించిన వీరి జోడిని విడగొడ్డలేకపోయారు.
ఈ దశలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్ తో ఈ జోడిని విడదీశాడు. 28 వ ఓవర్ లో బుమ్రా బౌలింగ్ లో టేలర్ డిఫెన్స్ ఆడి సింగిల్ కు ప్రయత్నించాడు. కవర్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లి పరిస్థితిని గమనించి మెరుపు వేగంతో అక్కడకు చేరుకుని బంతిని అందుకుని స్టంప్స్ ను గిరాటేశాడు. హెన్నీ నికోల్స్ డైవ్ చేసినప్పటికి వికెట్ ను కాపాడుకోలేకపోయాడు. రాస్ టేలర్-నికోల్స్ జోడి మూడో వికెట్ కు 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ప్రస్తుతం న్యూజిలాండ్ 31 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో రాస్ టేలర్ (41; 41బంతుల్లో 4పోర్లు, 1సిక్సర్) తో పాటు ఆ జట్టు కెప్టెన్ టామ్ లేథమ్ (3; 12బంతుల్లో)ఉన్నాడు. కివీస్ విజయానికి 19 ఓవర్లలో 170 పరుగులు అవసరం