ఔటర్ రింగ్ రోడ్డపై కారు బీభత్సం
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 1 Oct 2019 5:33 PM IST

పెద్ద అంబర్ పేట్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డపై కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై చెత్తను తొలగిస్తున్న పారిశుద్ద్య కార్మికులపైకి కారు దూసుకెళ్లింది. కార్ ఢీ కోట్టడంతో పారిశుద్ద్య కార్మికులు పోచమ్మ, స్వరూప, యాదయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని 108 సిబ్బంది వెంటనే హయత్ నగర్ లోని అమ్మ హస్పిటల్ కు తరలించారు. కారు పూర్తిగా దెబ్బతినడంతో కారు ఓనరు కారును అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story