రాజ్ త‌రుణ్ - హెబ్బా ప‌టేల్ జంట‌గా సినిమా, ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 16 Nov 2019 1:49 PM IST

రాజ్ త‌రుణ్ - హెబ్బా ప‌టేల్ జంట‌గా సినిమా,  ద‌ర్శ‌కుడు ఎవ‌రు..?

'ఏమైంది ఈ వేళ'‌, 'అధినేత'‌, 'బెంగాల్ టైగ‌ర్'‌, 'పంతం’ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌గా కార్తి ‘ఖైదీ’ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధా మోహ‌న్. ప్ర‌స్తుతం రాజ్‌త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం రూపోందుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ఓ కీలక పాత్ర‌లో ‘కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్ హెబ్బాప‌టేల్ న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో శుక్రవారం నుంచి హెబ్బా ప‌టేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమె పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా చిత్ర‌ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ.. మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న ‘ఒరేయ్ బుజ్జిగా’ షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క‌మైన పాత్ర‌లో ‘కుమారి 21 ఎఫ్‌’ చిత్రంతో యూత్‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ హెబ్బాప‌టేల్ న‌టిస్తున్నారు. మాళ‌వికా, హెబ్బా ప‌టేల్ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సంద‌ర్భంగా క‌థ న‌చ్చి సినిమా చేయ‌డానికి ఒప్పుకున్న హెబ్బాప‌టేల్‌కు థ్యాంక్స్‌. సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్‌కుమార్ తెర‌కెక్కిస్తున్నానన్నారు.

Next Story