కొద్దిరోజులుగా సామాన్యుని భయపెడుతున్న పేరు ఉల్లి. దేశ వ్యాప్తంగా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఉల్లి కోసం కొట్లాటలు, దొంగతనాలు ఇలా రకరకాలుగా వార్తల్లో నిలచింది. ధర చుక్కల నంటడమే ఇందుకు కారణం. దీంతో ఓ ఆన్ లైన్ బస్సు సర్వీస్ సంస్థ సరదాగా మీకు ఉల్లిపాయలు కావాలా..? గోవా ట్రిప్‌ కావాలా..? అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే ఇందులో పాల్గొన్నవారిలో 50 శాతం మందికి పైగా ఉల్లిపాయలను ఎంచుకోవడంతో ఆ సంస్థ ఆశ్చర్యంలో మునిగిపోయింది.

‘అభి బస్ అనే ఆన్ లైన్ బస్సు సర్వీసు ప్రమోషన్స్ విభాగం వారికి ఉల్లిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న జోక్స్, మీమ్స్ చూసి ఒక వినూత్న ఐడియా వచ్చింది. తమ ప్రయాణికులకు ఉల్లిపాయలు గెల్చుకునే పోటీ నిర్వహించాలని భావించింది. దీని కోసం 'డిసెంబర 10 నుంచి 15వ తేదీ వరకు ఎవరైతే తమ సంస్థలో టికెట్ బుక్ చేసుకుంటారో వారికి కొన్ని ఆఫర్లు ఇస్తున్నాం' అని ఆఫ‌ర్ చేశారు. అలా ఇచ్చిన ఆఫర్లలో గోవా ట్రిప్, ఐఫోన్, ఈ-బైక్ తోపాటు మూడు కేజీల ఉల్లిపాయలను కూడా ప్రకటించింది.

ఇందులో ఏదో ఒకదాన్ని ప్రయాణికులు ఎంచుకోవచ్చు. ఇక్క‌డ‌ ఆశ్చర్యం ఏంటంటే.. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో 56 శాతం మంది ఉల్లిపాయలను ఎంచుకున్నారట.. ఇక చేసేదేమి లేక ఈ సంస్థ తన ప్రయాణికుల్లో ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి మూడు కేజీలు చొప్పున ఉల్లిపాయలు అందజేస్తోంది.

Onion

జ్యోత్స్న

నేను జ్యోత్స్న, న్యూస్‌మీట‌ర్‌లో కంట్రిబ్యూట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నాను. గ‌తంలో tv9, జెమినీ న్యూస్ ల‌లో జ‌ర్న‌లిస్టుగా విధులు నిర్వ‌ర్తించాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో, నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Next Story