డబుల్ సెంచరీ వైపు ఉల్లి పరుగులు..!
By Newsmeter.Network Published on 5 Dec 2019 2:02 PM ISTఉల్లి రేటు స్పీడ్ పెరిగింది. డబుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతోంది. రెండు రోజుల కిందట కిలో యాబై రూపాయలు ఉన్న ఉల్లి ధర... ఇప్పుడు కిలో 150 రూపాయల దాటింది. మరో రెండు రోజులు మార్కెట్ పరిస్థితి ఇలా ఉంటే...రెండు వందలు దాటడం ఖాయం.
ప్రస్తుతం హైదరాబాద్ రియల్ మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.150. విజయవాడ,తిరుపతితో పాటు ప్రధాన పట్టణాల్లో కూడా ఇదే ధర ఉంది. ఇటు కర్నూలు మార్కెట్‌లో టన్ను ఉల్లి ధర 12 వేల రూపాయలు. హోల్‌సేల్ ధర 12 వేలు దాటింది. దీంతో రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధర మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది.
ఇటు నాసిక్ మార్కెట్‌లో కూడా టన్ను ధర 11వేలు దాటింది. రాబోయే రోజుల్లో 15 వేల ధరకు చేర అవకాశం ఉంది. దీంతో ఉల్లి రిటైల్ మార్కెట్ ధర మరో వారం రోజుల్లో 200 దాటే అవకాశం కన్పిస్తోంది. ఇటు రిటైల్ వ్యాపారులు కూడా ధర పెరగడంతో మార్కెట్లో ఎక్కువగా అమ్మడం లేదు. రోజురోజు ధర పెరిగే చాన్స్ ఉందని..అందుకే హోల్‌సేల్ వ్యాపారులు ఎక్కువ నిల్వ చేస్తున్నారని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
ఉల్లి ధర పెరగడంతో ఏపీలో రైతు బజార్లలో కిలో 25 రూపాయలకే అమ్ముతున్నారు. ఒకరికి కిలో మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతు బజార్లలో క్యూలు పెరిగిపోతున్నాయి. మదనపల్లి మార్కెట్‌లో ఉల్లి పాయల కోసం ఫైటింగ్ కూడా చేసారు. ఇటు ఉల్లి ధరలు తగ్గించాలని పార్లమెంట్ ఎదుట కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఈ సారి దేశ వ్యాప్తంగా వానలు కురవడంతో ఉల్లి ఉత్పత్తి తగ్గింది. ముఖ్యంగా మహారాష్ట్ర, రాయలసీమ నుంచి ఉల్లి ఎక్కువగా ఉత్పిత్తి అయ్యేది. ఈ సీజన్‌లో అక్కడ భారీ వానలు పడడంతో ఉల్లి దిగుబడి తగ్గింది. దీంతో టర్కీ నుంచి ఈ సారి ఉల్లి దిగుమతి చేసుకుంటున్నారు.