ఇంట్లో ఉల్లిపాయలు లేవు. ఒక కిలో తీసుకురండి అని అడగడమే పాపం. కళ్లింత చేసుకుని చూస్తున్న రోజులివి. ఉల్లి ధరలు అలా ఉన్నాయి మరి. కిలో చికెన్ రూ.200కి వస్తుంది. ఉల్లి ధరలు చికెన్ ను మించిపోయాయి. కిలో చికెన్ వండాలంటే కనీసం పావుకిలో ఉల్లి అయినా కావాల్సిందే కదా. అందుకే ఉల్లి ధరలు పెరిగినపుడు దళారులు తమ వద్ద నిల్వ ఉండిపోయి. సగం కుళ్లిన ఉల్లిపాయలు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. అదేమంటే స్టాక్ అలానే వచ్చిందని చెప్పిన సందర్భాలు కూడా లేకపోలేదు. అలా ఆకాశాన్నంటిన ఉల్లి ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి.

తాజాగా ఏపీ ప్రభుత్వం కిలో ఉల్లిని రూ.15 కే అందజేస్తున్నట్లు ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉల్లిని సాధారణ ధరకే విక్రయించాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం…రైతు బజార్ల ద్వారా రూ.15కి కిలో ఉల్లిని అందిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కరువు వచ్చినపుడు రైతు బజార్ల ద్వారానే రూ.25కి కిలో ఉల్లిని విక్రయించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో రూ.10 తగ్గించి రూ.15 కే ఉల్లిని ఇస్తోంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.