ఉల్లి ధర రూ.100కు చేరిందని.. ఆ దొంగలు ఏం చేశారంటే..!
By Newsmeter.Network Published on 28 Nov 2019 5:17 PM ISTకోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని ఓ కూరగాయల దుకాణంలో కొందరు దుండగులు ఉల్లిపాయలు దొంగతనం చేశారు. అయితే ఆ దుండగులు నగదు జోలికి వెళ్ల కుండా ఉల్లిపాయలు మాత్రమే ఎత్తుకెళ్లారు. కాగా.. కోల్‌కతాలో ఉల్లిధర రూ. 100 కు చేరింది. దీంతో ఈ చోరీ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
అయితే పశ్చిమబెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో సుతహత ప్రాంతంలో అక్షయ్ దాస్‌కు కూరగాయల దుకాణం ఉంది. తాజాగా ఆయన దుకాణంలో కొన్ని ఉల్లిపాయల బస్తాలను ఉల్లిపాయ బస్తాలు, కొన్ని వెల్లుల్లి, అల్లం బస్తాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన అక్షయ్ దాస్ క్యాష్ బాక్స్ దగ్గరికి వెళ్లి చూడగా అందులో నగదు మొత్తం అలానే ఉంది. చోరీ అయిన ఉల్లిపాయల విలువ రూ.50 వేలు వరకు ఉంటుందని అక్షయ్ తెలిపాడు. కోల్‌కతాలో ఉల్లి ధర రూ.100 చేరడం గమనార్హం.
Next Story