రతి సమయాన్ని పెంచే ఉల్లిపాయ- ఎలానో తెలుసా..?
By అంజి Published on 30 Jan 2020 7:59 AM ISTఉల్లిని చాలా మంది కూరలలోనే వాడుతూ ఉంటారు. మనం నిత్యం వంటలలో వాడే ఉల్లిపాయ ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరమైనది. ఎన్నో రకాల జబ్బులను నివారించడంలో ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉల్లిని కోస్తున్న సమయంలో కంట్లో నుంచి నీరు రావడం సహజం. దానికి ప్రధాన కారణం ఉల్లిలో ఉండే ఘాటైన సల్ఫర్ గ్యాస్. క్రీస్తు పూర్వం నుంచి ఉల్లి వాడుకలో ఉన్నట్టు తెలుస్తుంది. ఉల్లి చేసే ఆరోగ్య ప్రయోజనాలలో కొన్నింటిని తెలుసుకుందాం.
జ్వరం ఎక్కువగా వస్తుంటే ఉల్లిపాయను కట్‌చేసి కాలికింద పెట్టుకుంటే లేదా ఉల్లి ముక్కను కాలికింద పెట్టుకుని కింద పడకుండా సాక్సులు వేసుకుని పడుకున్నా జ్వరం తగ్గిపోతుంది. అజీర్తి వలన వాంతులు, విరేచనాలు అవుతుంటే ఉల్లిపాయ రసాన్ని వేడినీటిలో కలిపి అప్పుడప్పుడూ తాగుతూ ఉంటే వాంతులు, విరేచనాలు తగ్గుముఖం పడతాయి.
కాలిన బాగంలో ఉల్లిముక్కను ఉంచితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఉల్లిరసం, తేనె, రెండూ సమానంగా తీసుకుని బాగా జిలకరించి తాగితే గొంతునొప్పి, దగ్గు దూరమవుతుంది. ఉల్లిపాయ ఆస్తమా వ్యాధి గ్రస్తులకు మంచి ఆయుర్వేదమనే చెప్పవచ్చు. చెవి నొప్పి కలుగుతున్నప్పుడు, చెవిలో గుమిలి ఉన్నప్పుడు ఉల్లిపాయను పేస్ట్‌గా చేసుకుని చెవిలో ఉంచి కాస్త కాట్ ఉంచితే నొప్పి తగ్గి గుమిలి బయటకు వచ్చేస్తుంది. రక్తంలోని కొలస్ట్రాలను తగ్గించి గుండెను బలపరిచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఉల్లి చాలా సహాయపడుతుంది.
పెరుగుతో ఉల్లిరసం తీసుకుంటూ రక్తంలోని కొలస్ట్రాలు చక్కగా తగ్గాపోతాయి. దీని కారణంగా గుండె కూడా బలపడుతుంది. ఆలివ్ ఆయిల్ ఉల్లిరసం కలిపి ముఖానికి రాసుకుంటూ ఉంటే ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. అల్లంతో ఉల్లిరసం కలిపి తీసుకుంటే లైంగిక శక్తి పెరుగుతుంది. కడుపునొప్పి వంటివి తగ్గిపోతాయి. ఉల్లిరసాన్ని తలకు అప్లై చేసుకోవడం మూలాన జుట్టు దృఢంగా, ఒత్తుగా పెరుగుతుంది. జుట్టులో ఉన్న ఫంగస్‌ను చుండ్రును ఇది నివారిస్తుంది. జుట్టు ఊడిపోకుండా కూడా చూస్తుంది.
ఈ రోజుల్లో పురుషులు, మరియు స్త్రీలు మానసిక మరియు శారీరక సమస్యల కారణంగా శృంగారంలో భాగస్వామిని సంతృప్తి పరచడంలో విఫలమవుతున్నారు. రతి క్రీడలో లైంగిక సామర్ధ్యాన్ని ప్రదర్శించలేక చతికిలపడుతున్నారు. అయితే శృంగార శక్తిని పెంచే ఆహార పదార్ధాల్లో ఉల్లిపాయ ముందు వరుసలో ఉంటుంది. ఉల్లిపాయలు వేగవంతమైన, సహజవంతమైన లైంగిక సామర్ధ్యాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఉల్లిపాయను రోజువారి ఆహారంలో తీసుకోవడం వలన తగ్గిపోయిన లైంగిక శక్తిని తిరిగి పొందవచ్చు.
శీఘ్రస్కలనం, రతిలో ఎక్కువసేపు పాల్గొనలేకపోవడం, లైంగిక సామర్ధ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించలేకపోవడం వంటి శృంగార సమస్యలకు ఉల్లిపాయ చెక్ పెడుతుంది. వెన్నలో వేయించిన ఉల్లిపాయను తినడం ద్వారా సంభోగ శక్తి పెరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. మహిళల ఋతు సమయంలో వచ్చే నొప్పులను నివారిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సీ యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంది. నిద్ర లేమితో బాధపడే వారు తమ రోజూవారి ఆహారంలో ఉల్లిపాయను తీసుకోవడం ద్వారా సుఖవంతమైన నిద్రను పొందవచ్చు. అంతేకాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.