ఢిల్లీ: వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్‌ సర్కార్‌ మరోసారి సరి-బేసి విధానాన్నిఅమల్లోకి తెనుంది. నవంబర్‌ 4 నుంచి 15 వరకు ఢిల్లీలో సరి-బేసి విధానం అమల్లోకి వస్తుందని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. అయితే ఇది నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫోర్‌ వీలర్స్‌కు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఆడ్‌-ఈవన్‌ నుంచి ద్విచక్రవాహనాలకు మినహాయింపునిచ్చారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరి-బేసి విధానంలో వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఈ విధానాన్ని ఉల్లంఘించిన వాహనదారులకు రూ.4 వేల జరిమానా విధించనున్నారు. సరి-బేసి విధానం నుంచి ప్రధాని, రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌, చీఫ్‌ జస్టిస్‌ ఆఫ్‌ ఇండియా, గవర్నర్లు, చీఫ్‌ ఎలక్షన్‌ కమీషనర్‌, కేంద్రమంత్రులు, రాజ్యసభ్య, లోక్‌సభ ఎంపీలు, స్కూల్‌ బస్సులు, మహిళలకు ఈ విధానం నుంచి మినహాయింపునిచ్చింది. ఢిల్లీ మంత్రులకు మాత్రం ఈ విధానం నుంచి మినహాయింపు లేదన్నారు సీఎం కేజ్రీవాల్‌.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story