Fact Check : ట్రంప్ ఫ్లోరిడా ర్యాలీకి అంతమంది హాజరయ్యారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  27 Oct 2020 7:10 AM GMT
Fact Check : ట్రంప్ ఫ్లోరిడా ర్యాలీకి అంతమంది హాజరయ్యారా..?

పెద్ద సంఖ్యలో జనం.. రోడ్ల మీద మొత్తం జనాలే..! ఆ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అక్టోబర్ 2020న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర్యాలీ సమయంలో హాజరైన జనం అని పోస్టులు పెడుతూ ఉన్నారు.

T1

ఫేస్ బుక్ లో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. “Trump rally in Florida…How has Biden’s Crowds been? Oh, that’s right …there are too busy burning down cities. LOL”.అంటూ పోస్టు పెట్టారు. ట్రంప్ కోసం హాజరైన ప్రజలు ఇంత మంది ఉన్నారు..? మరి బిడెన్ కోసం ఇంతమంది హాజరవుతారా..? బిడెన్ మద్దతుదారులంతా నగరాలను కాల్చి వేస్తూ ఉంటే ఇక సభలకు ఎక్కడ హాజరవుతారు అని ఆ పోస్టు ద్వారా చెబుతూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

న్యూస్ మీటర్ ఈ ఫోటో మీద రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ‘Street Parade‘ అనే వెబ్సైట్ లో ఇమేజ్ గ్యాలరీలో ఉంది. 2019 స్విజర్లాండ్ లో ఓ ఇంటి పైన నుండి ఈ ఫోటోను తీశారు. 'స్ట్రీట్ పెరేడ్ జూరిచ్' అనే ఈవెంట్ లో భాగంగా 2019 సంవత్సరంలో ఈ ఫోటోను తీశారు.

T2

స్ట్రీట్ పెరేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రతి ఏడాది జూరిచ్ నగరంలో చోటు చేసుకుంటూ ఉంటుంది. పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్ ఉన్న ట్రక్ లు, డీజేలు, పార్టీ చేసుకోవాలి అని అనుకునే వారు.. అందరూ ఈ మ్యూజిక్ ఫెస్టివల్ కు హాజరవుతూ ఉంటారు. అక్కడే ఉన్న సరస్సు పక్కన పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తూ ఉంటారు ప్రజలు. స్టీట్ పెరేడ్ ఈవెంట్ కు వెళ్లాలని చాలా రోజుల ముందే ప్లాన్ చేసుకుంటూ ఉండే వాళ్లు ఎంతో మంది.

‘Resident Advisor‘ అనే వెబ్సైట్ లో కూడా ఈ ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసింది. టెక్నో ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలని స్పష్టం చేశారు.

‘Street Parade Zurich’ అంటూ వీడియోను 2019లో యుట్యూబ్ లో అప్లోడ్ చేశారు.

ఇలా స్విజర్లాండ్ లో చోటు చేసుకున్న ఈవెంట్ కు సంబంధించిన ఫోటోలు ఫ్లోరిడా లో డొనాల్డ్ ట్రంప్ ర్యాలీకి చెందిన ఫోటోలంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:Fact Check : ట్రంప్ ఫ్లోరిడా ర్యాలీకి అంతమంది హాజరయ్యారా..?
Claim Reviewed By:Misha Rajani
Claim Fact Check:false
Next Story