మళ్లీ పాతనోట్ల కలకలం.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పట్టుబడ్డ పాతనోట్లు

By సుభాష్
Published on : 29 Dec 2019 5:20 PM IST

మళ్లీ పాతనోట్ల కలకలం.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పట్టుబడ్డ పాతనోట్లు

దేశ ప్రధాని నరేంద్రమోదీ నోట్లను రద్దు చేసిన తర్వాత కూడా అక్కడక్కడ బయటపడ్డాయి. కొద్ది కాలంగా బయటకు వస్తున్న నోట్లు ఇప్పుడు పూర్తిస్థాయిలో లేకుండా పోయాయని అనుకున్న సమయంలో మళ్లీ ఇప్పుడు పాతనోట్లు బయటపడి సంచలనంగా మారింది.

డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఇలంగో కుమారుడు ఆనంద్‌ ఇంటిపై కేంద్ర ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో 250 రద్దయిన రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని అవశని నియోజకవర్గానికి ఇలంగో గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నిషేధించిన నోట్లను కోయంబత్తూరులో ఆనంద్‌కు చెందిన ప్రాంగణంలో దాచి ఉంచినట్లు తెలుస్తోంది. డీఎస్పీ వేల్‌మురుగన్‌ నేతృత్వంలో పోలీసు బృందం ఆనంద్‌ ఇంటిపై దాడి చేసి రద్దు చేసిన పాత నోట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా ఇంటి యజమాని ఆనంద్‌తోపాటు అద్దెకు ఉంటున్న రషీదు, షేక్‌లపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఆనంద్‌ ఇతరులతో కలిసి పాతనోట్లను తన నివాసంలో ఉంచి వాటిని మార్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2016 నవంబర్‌లో రూ. 1000, 500 నోట్లను మోదీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

Next Story