హైదరాబాద్: బాబా పేరు తో మోసాలు చేస్తున్న టిప్పు బాబాను హుస్సేని అలం పోలీసులు అరెస్ట్ చేశారు. రోగాలు నయం చేస్తానని మోసాలు చేస్తుండటంపై స్థానికులు ఈయనపై దృష్టి పెట్టారు. తన దగ్గరకు వచ్చేవారిని టిప్పు బాబా చిత్రహింసలు పెట్టేవారు. మంత్రాలతో సమస్యలు తొలగిస్తానని చెప్పి..సంబంధిత వీడియోలను యూ ట్యూబ్‌లో టిప్పు బాబా అప్‌లోడ్ చేస్తుండేవాడు. జావేద్ అనే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టిప్పు బాబాను హుస్సేనీ అలం పోలీసులు అరెస్ట్ చేశారు.