బెండకాయ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. తెలిస్తే అస్సలు వదలరు

By సుభాష్  Published on  8 March 2020 7:50 PM IST
బెండకాయ నీరు తాగితే ఏమవుతుందో తెలుసా.. తెలిస్తే అస్సలు వదలరు

అన్ని కాలాల్లో దొరికే బెండకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో ఎన్నో రకాలుగా వంటలు చేస్తారు. చాలా మంది బెండకాయలను ‌ఫ్రై చేస్తుంటారు. బెండకాయలను ఎలా తిన్నా వాటిలో పోషకాలు మాత్రం ఎంతో కొంత అందుతాయి. పూర్తిగా పోషకాలు అందాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. బెండకాయలు రెండు, లేదా మూడు తీసుకుని బాగా కడిగి, వాటిని మొదట, చివర్లో కోసేయాలి. వాటిని నిలువుగా కోయాలి. ఆ ముక్కలను గ్లాస్‌ నీటిలో వేయాలి. వాటిని రాత్రంతా నీటిలో నాననివ్వాలి. ఇలా ఉంచినట్లయితే వాటిలో ఉండే పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. ఉదయాన్నే నీటిలోని బెండ ముక్కల్ని తీసేసి తాగాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.

పొట్టలో పేగులను శుభ్రపరుస్తాయి

ఇక బెండకాయ నీటిని తాగడం వల్ల మన పొట్టలో పేగులు, జీర్ణాశయాన్ని శుభ్రపరుస్తాయి. ఎసీడీటీ, మలబద్దకం లాంటి సమస్యలను తరిమికొడుతుంది. బెండకాయల్లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. తినే ఆహారాన్ని చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెండకాయలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుంది. హైబీపీ ఉన్నవారికి మంచి ఔషధంగా పని చేస్తుంది. బీపీ కంట్రోల్లో ఉంటుందంటున్నారు వైద్య నిపుణులు.

మధుమోహం ఉన్నవారికి..

ఇప్పుడున్న కాలంలో మధుమోహం ఉన్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు వస్తుంది. షుగర్‌ వ్యాధి ఉన్నవారికి బెండకాయలు ఎంతో ఉపయోగపడతాయి. బెండకాయలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్లో ఉంటాయి.

కంటి చూపు సమస్య ఉన్నవారికి..

ఈ రోజుల్లో కంటి చూపు సమస్యతో బాధపడేవారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది. ఈ కంటి చూపు సమస్య మధుమోహం ఉన్నవారిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి వారికి బెండకాయలు ఎంతో ఉపయోగపడతాయి. ఇలా నానబెట్టిన నీరు తాగడం వల్ల కంటి చూపునకు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు వైద్య నిపుణులు. అంతేకాదు స్కిన్‌, హెయిర్‌కి కూడా ఈ నీరు ఎంతో ఉపయోగపడుతుందట.

బరువు తగ్గించుకునేందుకు

బరువు తగ్గించుకునేందుకు బెండకాయలు ఎంతో ఉపయోగపడతాయి. శరీరంలో వ్యర్థాల్ని తరిమికొట్టేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. అధిక బరువు ఉన్నవారికి ఈ బెండకాయలు ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఒంట్లో వేడి ఉంటే తరిమికొడుతుంది. ఇలా బెండకాయల్లో ఎన్నో రకాలుగా ఉపయోగాలున్నాయి.

Next Story