సంక్షోభ సమయంలో ఐక్యంగా ఉండాలని నిరూపించిన పక్షులు
Video of Birds Protecting Their Nest From Snake Wins Internet.జంతుజాలానికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ
By M.S.R Published on 7 March 2022 3:15 PM GMTజంతుజాలానికి సంబంధించిన వీడియోలు ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. డిజిటల్ కాలంలో వెంటనే వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూడటానికి ఆసక్తికరంగా ఉండటమే కాకుండా మనకు కొన్ని పాఠాలు కూడా నేర్పుతాయి. చిన్న జీవులు ఆధిపత్యాన్ని తట్టుకుని ఎలా బ్రతుకుతున్నాయోనని తెలుసుకుంటే మనం తప్పకుండా ఆశ్చర్యపోతాము. సమైక్యంగా ఉంటే ఎలాంటి వాటినైనా ఎదుర్కోవచ్చనే విషయాన్ని ఈ పక్షుల గుంపు తెలియజేస్తుంది.
'లేటెస్ట్ సైటింగ్స్' అనే యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అప్‌లోడ్ చేయబడింది. చెట్టు కొమ్మ నుండి వేలాడుతున్న తమ గూళ్ళపై పాము దాడి చేస్తుండడంతో ఆ చిన్న పక్షులు నిర్విరామంగా ఆ పాముపై దాడి చేశాయి. చివరికి ఆ పాము ఆ పక్షుల దాడిని తట్టుకోలేక తిరిగి వెళ్ళిపోయింది.
పాము చెట్టుపై ఒక గూడు నుండి మరొక గూడు పైకి వెళ్లడానికి ప్రయత్నిస్తోంది. ఆ సమయంలో పామును ఒక పక్షి గుర్తించింది. అది వెంటనే దానికి దగ్గరగా ఎగరడం ప్రారంభిస్తుంది, పాము స్పందించకముందే దానిని తన ముక్కుతో గుచ్చేసి ఎగిరిపోతుంది. ఇతర పక్షులు కూడా గూడులోని తమ పిల్లలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి. అవన్నీ పాముపై దాడి చేయడం ఎగిరిపోవడం మొదలుపెట్టాయి. పాము గూడులోకి వెళ్లడానికి చాలా సేపు ప్రయత్నించినప్పటికీ, వెళ్ళడానికి వీలు కుదరకపోవడంతో పక్షులు విజయం సాధించాయి. ఆ పాము అక్కడి నుండి వెళ్ళిపోయింది. సంక్షోభ సమయంలో ఐక్యంగా ఉండటానికి మానవులకు ఒక గుణపాఠం ఇది చెబుతున్నారు. పక్షుల ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ వీడియోపై పలువురు కామెంట్స్ చేశారు.