ఈ ప్రపంచంలో వింతలకు కొదవలేదు. సాధారణంగా ఏదైన ప్రాణి ఒక తలతో జన్మిస్తుంది. ఒకవేళ రెండు తలతో జన్మిస్తే.. అది ఖచ్చితంగా వింతే. ఒక్కొసారి జన్యులోపాలతో మనుషుల్లోనూ రెండు తలల శిశువులు జన్మించడాన్నిమనం చూశాం. అరుదైన పరిస్థితుల్లో తప్ప.. వీళ్లు ప్రాణాలతో బతికే పరిస్థితి ఉండదు. విశాఖ జిల్లా జహీరాబాద్ మండలంలో జీవన్గి గ్రామంలో ఇలాంటి ఘటననే శుక్రవారం (సెప్టెంబర్ 24)న జరిగింది
వీరారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఓ గేదె రెండు తలలతో ఉన్న దూడెకు జన్మనిచ్చింది. గేదె ఈతకు ఇబ్బంది పడుతుతుండంతో పశు వైద్యుడికి సమాచారం ఇచ్చారు. గేదెను పరీక్షించిన వైద్యుడు.. జాగ్రత్తగా దూడను కడుపులోంచి బయటకు తీశారు. కాగా.. రెండు తలలతో దూడె జన్మించిందన్న విషయం క్షణాల్లో గ్రామమంతా పాకింది. ఈ దూడెను చూసేందుకు వీరారెడ్డి ఇంటికి గ్రామస్తులు పోటెత్తారు. కాగా.. జన్యుపరమైన లోపాలతోనే ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు.