పవర్ ఆఫ్ సోషల్ మీడియా: బెలూన్స్ అమ్ముకునే అమ్మాయి.. ఏకంగా మోడల్

This balloon-seller from Kerala became an overnight internet sensation after her photo went viral.ఇంటర్నెట్ ఒక శక్తివంతమైన

By M.S.R
Published on : 8 March 2022 5:30 PM IST

పవర్ ఆఫ్ సోషల్ మీడియా: బెలూన్స్ అమ్ముకునే అమ్మాయి.. ఏకంగా మోడల్

ఇంటర్నెట్ ఒక శక్తివంతమైన మాధ్యమం. సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే ఎవరినైనా సెలబ్రిటీని చేయగలదనే వాస్తవాన్ని కాదనలేము. ఎంతోమంది వ్యక్తులు తక్కువ సమయంలోనే ఇంటర్నెట్ లో పాపులర్ అయిపోవడం మనం గమనించే ఉంటాం. ఇప్పుడు ఆ లిస్ట్‌కి మరో అమ్మాయి వచ్చింది. కేరళలో రద్దీగా ఉండే ప్రదేశాలలో బెలూన్లు అమ్మే ఒక అమ్మాయి వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ ఫోటోషూట్ కోసం మోడల్‌గా మారడంతో ఇంటర్నెట్ స్టార్ అయ్యింది.

అర్జున్ కృష్ణన్ అనే ఫోటోగ్రాఫర్ కేరళలోని ఆండలూర్ కావు ఉత్సవంలో అమ్మాయిని గుర్తించాడు. ఆమెను అతడు తన కెమెరాలో బంధించాడు. అర్జున్ ఆ ఫోటోను అమ్మాయికి మరియు ఆమె తల్లికి కూడా చూపించాడు. కిస్బు అనే అమ్మాయి రాజస్థానీ కుటుంబానికి చెందినది.. కేరళలో బెలూన్స్ అమ్ముతూ ఉంది. అర్జున్ సోషల్ మీడియాలో తన ఫోటోను పంచుకున్నాడు. ఆ ఫొటోకు మంచి స్పందన వచ్చింది. అతని స్నేహితుడు శ్రేయాస్ కూడా కిస్బు చిత్రాన్ని తీశాడు, అది కూడా వైరల్ అయింది. విపరీతమైన స్పందన వచ్చిన తర్వాత కిస్బు కుటుంబంతో ఫోటోషూట్ కోసం ఒకరు సంప్రదించారు. రమ్య అనే స్టైలిస్ట్ సహాయంతో ఆ అమ్మాయి లుక్ మొత్తం మార్చేశారు. ఆమె మేకోవర్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

Next Story